క్లీన్‌ ఎలక్షన్స్‌.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం | SC Key Comments Over Biometric System At Polling Stations | Sakshi
Sakshi News home page

క్లీన్‌ ఎలక్షన్స్‌.. సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

Apr 13 2026 2:15 PM | Updated on Apr 13 2026 2:27 PM

SC Key Comments Over Biometric System At Polling Stations

ఎన్నికల్లో అవకతవకలు నివారించే ఉద్దేశంతో దాఖలైన ఓ పిటిషన్‌పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని కచ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని చెబుతూ సోమవారం కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.

పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లను గుర్తించేలా చేతివేళ్లు (Fingers), కంటి (Iris)‌ సంబంధిత బయో మెట్రిక్‌ గుర్తింపు ఏర్పాట్లు చేయాలని ఓ పిటిషన్‌ దాఖలైంది. తద్వారా నకిలీ ఓట్లకు చెక్‌ పెట్టవచ్చని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్య కాంత, జస్టిస్‌ జే బాగ్చీలతో కూడిన ధర్మాసనం.. ఇది విచారణకు అర్హత ఉన్న అంశమని వ్యాఖ్యానించింది. అలాగే పిటిషన్‌పై స్పందన తెలియజేయాలంటూ ఈసీకి, కేంద్రానికి, పలు రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది. 

అదే సమయంలో.. బయో మెట్రిక్‌ అంశాన్ని ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు వర్తింపజేయాలన్న పిటిషనర్‌ విజ్ఞప్తిని సీజే బెంచ్‌ తోసిపుచ్చింది. అది సాధ్యమయయే పని కాదని పేర్కొంది. కేంద్రం, ఎన్నికల సంఘం, రాష్ట్రాల నుంచి స్పందన తర్వాత ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ ఉండే అవకాశం ఉంది.

అడ్వొకేట్‌ అశ్విని కుమార్‌ ఉపాధ్యాయ్‌ వేసిన ఈ పిటిషన్‌లో.. ఒక ఓటర్‌ స్థానంలో మరొకరు ఓటేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. డూప్లికేట్‌ ఓటింగ్‌, గోస్ట్‌ ఓటింగ్‌.. ఇలాంటి అక్రమాలు ఎన్నికల్లో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వీటిని అరికట్టడానికి పోలింగ్‌ బూత్‌ల వద్ద బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ సిస్టమ్‌ అమలు చేయాలి.

సీజే బెంచ్‌ ఏమందంటే.. ఓటర్ల గుర్తింపులో బయోమెట్రిక్‌ అవసరమా?. ఇలాంటి చర్యను వచ్చే పార్లమెంట్‌ లేదంటే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. దేనికంటే ముందు అమలు చేయాలి? అనే అంశం పరిశీలించాల్సి ఉంది.

ఇప్పటికే ఈవీఎంల అవకతవక అంశం, ఈసీ పాత్రపై ఆరోపణలతో దేశ ఎన్నికల ప్రక్రియపై దేశవ్యాప్త చర్చ నడుస్తోంది. బ్యాలెట్‌ ఎన్నికలు తిరిగి నిర్వహించాలన్న డిమాండ్‌ బలంగా వినిపిస్తోంది. ఈ తరుణంలో.. క్లీన్‌ ఎలక్షన్స్‌ కోసం బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ వంటి సాంకేతిక పరిష్కారాన్ని ఎలక్షన్ల ప్రక్రియలో చేర్చవచ్చనే అంశాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించాలనుకోవడం విశేషం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement