SBI Recruitment 2021 Notification, Vacancies, Application Process In Telugu - Sakshi
Sakshi News home page

SBI Recruitment 2021: ఎస్‌బీఐలో 5454 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు

Apr 28 2021 1:44 PM | Updated on Apr 28 2021 7:47 PM

SBI Recruitment 2021: Apply for Junior Associates Post, Eligibility, Selection Process Details - Sakshi

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. క్లరికల్‌ కేడర్‌లో 5454 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న దేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌.. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. క్లరికల్‌ కేడర్‌లో 5454 జూనియర్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

పోస్టులు: జూనియర్‌ అసోసియేట్స్‌(కస్టమర్‌ సపోర్ట్‌ అండ్‌ సేల్స్‌)
మొత్తం పోస్టుల సంఖ్య: 5454 (రెగ్యులర్‌–5000, బ్యాక్‌లాగ్‌– ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ –121, పీడబ్ల్యూడీ–96, ఎక్స్‌సర్వీస్‌మెన్‌–237).
► హైదరాబాద్‌ సర్కిల్‌(తెలంగాణ)లో పోస్టుల సంఖ్య: 275.


విద్యార్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్‌/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. డిగ్రీ ఫైనల్‌/చివరి సెమిస్టర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 
వయసు: 01.04.2021 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. 02.04.1993 –01.04.2001 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడీబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. 

ఎంపిక విధానం: 
► ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), స్థానిక భాష పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. 

ప్రిలిమినరీ పరీక్ష : 
► ఇది 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు–30 మార్కులకు; న్యూమరికల్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు; రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు జరుగుతుంది.  పరీక్ష సమయం ఒక గంట. నెగిటివ్‌ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెయిన్‌ ఎగ్జామ్‌కు ఎంపిక చేస్తారు. 


మెయిన్‌ ఎగ్జామ్‌:
► మెయిన్‌ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నల సంఖ్య 190. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు; జనరల్‌ ఇంగ్లిష్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు; క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు; రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు–60 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 2గంటల 40నిమిషాలు. 

ముఖ్య సమాచారం:
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
► దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు రూ.750 చెల్లించాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.04.2021
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 17.05.2021
► ప్రిలిమినరీ పరీక్ష : జూన్‌ 2021లో జరుగుతుంది. 
► మెయిన్‌ పరీక్ష తేది: 31.07.2021
► పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://bank.sbi/careers

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement