రాజ్‌భవన్‌ ప్రాంగణంలోని చందనం చెట్టు మాయం | Sakshi
Sakshi News home page

రాజ్‌భవన్‌ ప్రాంగణంలోని చందనం చెట్టు మాయం

Published Fri, Nov 4 2022 6:13 AM

Sandalwood tree stolen from Odisha Raj Bhavan premises - Sakshi

భువనేశ్వర్‌: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని రాజ్‌భవన్‌ ఆవరణలో ఉన్న అరుదైన చందనం చెట్టును గుర్తు తెలియని వ్యక్తులు మాయం చేశారు. అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో ఉన్న చెట్టును మంగళవారం దుండగులు నరికేసి, ఎత్తుకుపోయారు.

గవర్నర్‌ అధికార నివాసంలో చోటుచేసుకున్న ఘటనపై రాజ్‌భవన్‌ వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా కొందరు అనుమానితులపై నిఘా పెట్టామని, దోషులెవరో త్వరలోనే తేలుస్తామని పోలీసులు గురువారం చెప్పారు. చందనం చెట్ల పరిరక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం విధించింది. చందనం కలపను కోతకు, రవాణాకు అటవీ శాఖ నుంచి ముందుగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. 

Advertisement
 
Advertisement