నాపై హత్యాయత్నం చేసింది పిన్ని అనురాధ..? | Ricky Rai Shootout Case | Sakshi
Sakshi News home page

నాపై హత్యాయత్నం చేసింది పిన్ని అనురాధ..?

Apr 22 2025 7:37 AM | Updated on Apr 22 2025 7:37 AM

Ricky Rai Shootout Case

బిడదిలో హత్యాయత్నం కేసు..

వాంగ్మూలం తీసుకున్న పోలీసులు

దొడ్డబళ్లాపురం: రామనగర తాలూకా బిడదిలో మాజీ మాఫియా డాన్‌ దివంగత ముత్తప్పరై చిన్న కుమారుడు రిక్కీ రై పై 18న అర్ధరాత్రి కాల్పులు జరిపి హత్యాయత్నం చేసిన కేసులో పోలీసులు అతని వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. అలాగే రిక్కీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులు, పనివాళ్లు, సెక్యూరిటీని విచారించారు. సంఘటన జరిగిన చుట్టుపక్కల పరిసరాల్లో శోధిస్తున్నారు. మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిక్కీ రై కోలుకుంటున్నాడు.

వారి మీదే అనుమానం
నా మీద హత్యాయత్నం చేసింది తన పిన్ని అనురాధ, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నితేశ్‌ శెట్టి, రాకేశ్‌ మల్లి, వైద్యనాథన్‌ అనేవారని రిక్కీ రై చెప్పినట్లు తెలిసింది. దీంతో పోలీసులు వారికి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వనున్నారు. అయితే రిక్కీ పిన్ని అనురాధ కాల్పులు జరగడానికి ఐదు రోజుల ముందు విదేశాలకు వెళ్లిపోయినట్టు సమాచారం.

కుక్కలు మొరిగాయి
కాల్పులు జరిగిన రోజు రిక్కీ ఇంట్లో ఉండగా కుక్కలు మొరగడంతో ఒక గన్‌ మ్యాన్‌ గాల్లోకి ఒక రౌండ్‌ కాల్పులు జరిపాడు. కాసేపటికి రిక్కీ కారులో బయలుదేరగానే కాల్పులు జరిగాయి. రిక్కీ వెంట ఉన్న గన్‌మ్యాన్‌ను పోలీసులు విచారించారు. హోంమంత్రి పరమేశ్వర్‌ కాల్పుల గురించి మాట్లాడుతూ కాంగ్రెస్‌ కార్యకర్త రాకేశ్‌ మల్లి ప్రమేయం గురించి తనకు తెలియదన్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement