వైరలవుతోన్న ప్రియాంక కుమారుడి పోస్ట్‌ | Priyanka Gandhi Son Shares Tiger Photo Goes Viral | Sakshi
Sakshi News home page

ఈ ఫోటోలో పులి కన్నును గుర్తించండి?!

Oct 7 2020 4:54 PM | Updated on Oct 7 2020 6:51 PM

Priyanka Gandhi Son Shares Tiger Photo Goes Viral - Sakshi

ఈ మధ్య సోషల్‌ మీడియాలో రకరకాల చాలెంజ్‌లు వైరలవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సవాలు తెర మీదకు వచ్చింది. అయితే ఈ సారి చాలెంజ్‌కి ఓ ప్రత్యేకత ఉంది. ఏంటంటే.. కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ కుమారుడి షేర్‌ చేసిన ఫోటోకు సంబంధించిన చాలెంజ్‌ ఇది. దాంతో ఇది ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తోంది. వివరాలు..  ప్రియాంక గాంధీ కుమారుడు రియ్హాన్‌ రాజీవ్‌ వాద్రా ప్రస్తుతం రణతంబోర్‌ నేషనల్‌ పార్కులో వైల్డ్‌లైఫ్‌ ఫోటోగ్రాఫర్‌గా బిజీ బిజీగా గడుపుతున్నారు. పార్కు అందాలను, వన్య ప్రాణులను తన కెమరాలో బంధించి అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం రియ్హాన్‌ ట్వీట్‌‌ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆకుపచ్చ ఆకుల మధ్య ఓ పులి కన్ను కనిపిస్తోంది. ప్రకృతి వర్ణాల మధ్య పులి కన్ను కూడా ఆ రంగులోనే కనిపిస్తుంది. (చదవండి: వైరల్‌ అవుతున్నపెళ్లి ప్రకటన)

దాంతో నెటిజనులు ఇందులో పులి కన్నుని కనుక్కొండి అంటూ ఈ ఫోటోని రీట్వీట్‌, షేర్‌ చేస్తున్నారు. అంతేకాక అద్భుతమైన ఫోటోలు తీశారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా రియ్హాన్‌ వన్యప్రాణులు.. ముఖ్యంగా పులులకు సంబంధించిన ఫోటోలు షేర్‌ చేస్తూ.. అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement