breaking news
priyanka gandhi son
-
వైరలవుతోన్న ప్రియాంక కుమారుడి పోస్ట్
ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల చాలెంజ్‌లు వైరలవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సవాలు తెర మీదకు వచ్చింది. అయితే ఈ సారి చాలెంజ్‌కి ఓ ప్రత్యేకత ఉంది. ఏంటంటే.. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ కుమారుడి షేర్ చేసిన ఫోటోకు సంబంధించిన చాలెంజ్ ఇది. దాంతో ఇది ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తోంది. వివరాలు.. ప్రియాంక గాంధీ కుమారుడు రియ్హాన్ రాజీవ్ వాద్రా ప్రస్తుతం రణతంబోర్ నేషనల్ పార్కులో వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్‌గా బిజీ బిజీగా గడుపుతున్నారు. పార్కు అందాలను, వన్య ప్రాణులను తన కెమరాలో బంధించి అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం రియ్హాన్ ట్వీట్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆకుపచ్చ ఆకుల మధ్య ఓ పులి కన్ను కనిపిస్తోంది. ప్రకృతి వర్ణాల మధ్య పులి కన్ను కూడా ఆ రంగులోనే కనిపిస్తుంది. (చదవండి: వైరల్ అవుతున్నపెళ్లి ప్రకటన) Eye Spy T-101, Zone - 6, Ranthambore National Park, 06/10/20. pic.twitter.com/nQ5g2RV9Wp — Raihan Rajiv Vadra (@raihanrvadra) October 7, 2020 దాంతో నెటిజనులు ఇందులో పులి కన్నుని కనుక్కొండి అంటూ ఈ ఫోటోని రీట్వీట్, షేర్ చేస్తున్నారు. అంతేకాక అద్భుతమైన ఫోటోలు తీశారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా రియ్హాన్ వన్యప్రాణులు.. ముఖ్యంగా పులులకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ.. అభిమానులను ఆకట్టుకుంటున్నారు. -
అమేథీలో పర్యటించిన ప్రియాంక కొడుకు
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మనవడు, ప్రియాంక - రాబర్ట్ వాద్రాల కొడుకు రేహన్ అమేథీలో పర్యటించాడు. ఒక రాత్రి అక్కడే ఉన్నాడు. 14 ఏళ్ల రేహన్ ఎవరికీ ముందుగా చెప్పకుండా.. తన స్నేహితులతో కలిసి కారులో అక్కడకు వెళ్లాడు. ఒక గ్రామంలో పర్యటించి అక్కడి సమస్యలేంటని గ్రామస్థులను అడగడంతో పాటు.. వాళ్లతో కలిసి భోజనం చేశాడు. తర్వాత మున్షీగంజ్ లోని సంజయ్ గాంధీ ఆస్పత్రి గెస్ట్‌హౌస్‌కు వెళ్లి అక్కడ ప్రజలను కలిశాడు. రేహన్ వస్తున్నట్లు ముందుగా ఎవరికీ తెలియకపోవడంతో.. గ్రామస్థులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అమేథీ నియోజకవర్గానికి ప్రస్తుతం రేహన్ మేనమామ రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సోనియా, ప్రియాంక కూడా ఇక్కడ తరచు పర్యటిస్తుంటారు. అమేథీ, రాయ్‌బరేలి రెండూ ఎప్పటినుంచో కాంగ్రెస్ కంచుకోటలు.