దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాపం | Pranab Mukherjee Passed Away : Centre declares 7 days National Mourning Period | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాపం

Aug 31 2020 8:07 PM | Updated on Aug 31 2020 8:08 PM

Pranab Mukherjee Passed Away : Centre declares 7 days National Mourning Period - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ  : మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) మరణంతో దేశంలో విషాదం నెలకొంది. ఆయన మరణం పట్ల ‌రాష్ట్రప​తి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీతో పాలు పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతిగా, కేంద్ర మంత్రిగా ఆయన అందించిన సేవలను స్మరించుకొనేందుకు దేశ వ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాపం ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది.
(చదవండి : మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కన్నుమూత)

అలాగే రాష్ట్రపతి భవన్‌తో సహా అన్ని కార్యాలయాలపై జాతీయజెండా అవనతం చేయాలని కేంద్రం ప్రకటించింది. అధికారిక లాంఛనాలతో ప్రణబ్‌ అంత్యక్రియలు నిర్వహించేందుకు రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సైనిక వందనంతో వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు చేస్తోంది. రేపు ఢిల్లీలో ప్రణబ్‌ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, గత కొంతకాలంగా కోవిడ్‌తో పాటు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రణబ్‌ సోమవారం సాయంత్రంతుది శ్వాస విడిచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement