Postal Department: పదో తరగతి అర్హతతో 38926 ఉద్యోగాలు | Sakshi
Sakshi News home page

Postal Department: పదో తరగతి అర్హతతో 38926 ఉద్యోగాలు

Published Tue, May 3 2022 8:59 PM

Postal Department 38926 Grammen Docseval Posts - Sakshi

భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన పోస్టల్‌ విభాగం దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 
మొత్తం పోస్టుల సంఖ్య: 38926
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: తెలంగాణ–1226,ఆంధ్రప్రదేశ్‌–1716.»పోస్టుల వివరాలు: బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌(ఏబీపీఎం),డాక్‌ సేవక్‌.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక భాషతోపాటు సైకిల్‌ తొక్కడం వచ్చి ఉండాలి. 
వయసు: 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. 

జీతభత్యాలు
టైం రిలేటెడ్‌ కంటిన్యూటీ అలవెన్స్‌ (టీఆర్‌సీఏ) ప్రకారం జీతభత్యాలు చెల్లించాలి. 
బీపీఎం పోస్టులకు నాలుగు గంటల టీఆర్‌సీఏ సబ్‌ ప్లాన్‌ కింద నెలకు రూ.12000 చెల్లిస్తారు. ఏబీపీఎం/డాక్‌సేవక్‌ పోస్టులకు నాలుగు గంటల టీఆర్‌సీఏ సబ్‌ ప్లాన్‌ కింద నెలకు రూ.10000 చెల్లిస్తారు. 

ఎంపిక విధానం
పదో తరగతిలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సిస్టమ్‌ జనరేటెడ్‌ మెరిట్‌ లిస్ట్‌ ప్రకారం తుది ఎంపిక జరుగుతుంది. 
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. 
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.05.2022
దరఖాస్తులకు చివరి తేది: 05.06.2022
వెబ్‌సైట్‌: https://indiapostgdsonline.gov.in

Advertisement
 
Advertisement
 
Advertisement