PM Narendra Modi Wishes Sonia Gandhi On 76th Birthday - Sakshi
Sakshi News home page

సోనియాకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు

Dec 9 2022 11:16 AM | Updated on Dec 9 2022 12:51 PM

PM Modi Wishes Sonia Gandhi On 76th Birthday - Sakshi

ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు ప్రముఖులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలియన్స్‌(యూపీఏ) ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ శుక్రవారం 76వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో పాటు పలువురు ప్రముఖులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు మంచి ఆరోగ్యంతో కూడిన సుదీర్ఘ జీవితాన్ని భగవంతుడు ప్రసాదించాలని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత శశిథరూర్‌ తో పాటు పలువురు నేతలు సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘పుట్టిన రోజు సందర్భంగా యూపీఏ ఛైర్‌పర్సన్‌, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి శుభాకాంక్షలు. ఆమెకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.’ అంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సల్మాన్‌ ఖుర్షిద్‌ ట్వీట్‌ చేశారు. యూత్‌ కాంగ్రెస్‌ నేత శ్రీనివాస్‌ బీవీ సైతం ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

రాజస్థాన్‌కు సోనియా..
భారత్‌ జోడో యాత్ర రాజస్థాన్‌లో కొనసాగుతున్న క్రమంలో గురువారం జైపూర్‌కు చేరుకున్నారు కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. రెండు రోజుల పాటు రాజస్థాన్‌లో పర్యటించనున్నారు. గురువారం జైపూర్‌ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో సవాయ్‌ మాధాపుర్‌కు చేరుకున్నారు. షేర్‌ బాఘ్‌ హోటల్‌లో శుక్రవారం సోనియా జన్మదిన వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పార్టీ సీనియర్‌ నేతలు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, సోనియా కూతురు ప్రియాంక గాంధీ సైతం సవాయ్‌ మాధాపూర్‌కు చేరుకున్నారని చెప్పారు. ‘వారు రంథాంభోర్‌లో ఉంటారు. డిసెంబర్‌ 9న అక్కడే సోనియా గాంధీ పుట్టిన రోజు వేడుకలు ఉంటాయి. ’ అని తెలిపారు.

ఇదీ చదవండి: ప్రతీ అడుగు పక్కాగా... మోదీ మంత్రం, షా తంత్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement