రాంచీలో బిర్సా ముండా స్మారకాన్ని ప్రారంభించిన మోదీ

PM Modi Inaugurates Memorial In Tribal Freedom Birsa Mundas Honor In Ranchi - Sakshi

రాంచీ: ధార్తీ ఆబాగా ప్రసిద్ధి చెందిన గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జ్ఞాపకార్థం ప్రధాని నరేంద్ర మోదీ రాంచీలో మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "ధార్తీ ఆబా ఎక్కువ కాలం జీవించలేకపోయినప్పటికీ  భవిష్యత్ తరాలకు దిశానిర్దేశం చేసేలా  భారత చరిత్రలో లిఖించబడిని ఒక మహోన్నత వ్యక్తిగా అభివర్ణించారు. అంతేకాదు ముండాకు భారతదేశ గిరిజన సమాజ గుర్తింపును చెరిపివేయాలని కోరుకునే భావజాలానికి వ్యతిరేకంగా పోరాడిని గొప్ప వ్యక్తి బిర్సా .

(చదవండి: జిమ్‌లో అసభ్య ప్రవర్తన... టిక్‌టాక్‌ షేర్‌ చేయడంతో పరార్‌!!)

ఆధునికత పేరుతో వైవిధ్యంపై దాడి చేయడం, ప్రాచీన గుర్తింపును, ప్రకృతిని తారుమారు చేయడం సమాజ శ్రేయస్సుకు మార్గం కాదని భగవాన్ బిర్సాకు తెలుసు. ఆధునిక విద్యకు అనుకూల మార్పు కోసం వాదించాడు. అంతేకాదు తన గిరిజన సమాజంలోని లోటుపాట్లను గురించి మాట్లాడే ధైర్యం చూపించాడు." అని అన్నారు. ఈ మేరకు మోదీ  బిర్సా ముండా మెమోరియల్ ఉద్యాన్ మ్యూజియంను జాతికి అంకితం చేశారు. జార్ఖండ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కేంద్ర మంత్రి అర్జున్ ముండా, మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ తదితరులు పాల్గొన్నారు.

అయితే ఈ మ్యూజియం రాంచీలోని బిర్సా ముండా తుది శ్వాస విడిచిన ఓల్డ్ సెంట్రల్ జైలులో ఉంది. అంతేకాదు ఇక్కడ 25 అడుగుల ఎత్తు ఉన్న ముండా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ మ్యూజియం ఆదివాసీలు తమ అడవులు, భూమి హక్కులు, సంస్కృతిని పరిరక్షించడానికి  వారు ప్రదర్శించిన శౌర్యాన్ని, త్యాగాలను ప్రతిబింబిస్తుందని ఇది దేశ నిర్మాణానికి చాలా ముఖ్యమైనదని అని మోదీ అన్నారు. పైగా ముండాతో పాటు, బుధు భగత్, సిద్ధూ-కన్హు, నీలాంబర్-పీతాంబర్, దివా-కిసున్, తెలంగాణ ఖాదియా, గయా ముండా, జాత్రా భగత్, పోటో హెచ్ భగీరథ్ మాంఝీ  గంగా నారాయణ్ సింగ్ వంటి గిరిజన స్వాతంత్య్ర సమరయోధులను కూడా ఈ మ్యూజియం హైలైట్ చేస్తుంది.

(చదవండి: యూకే లివర్‌పూల్‌ నగరంలో కారు బ్లాస్ట్‌... ఒకరు మృతి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top