
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ కు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వినియోగదారుల వ్యవహారాల శాఖ అదనపు బాధ్యతలను శుక్రవారం అప్పగించారు. కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ గురువారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీనితో ఈ శాఖకు సంబంధించిన అదనపు బాధ్యతలను పీయుష్ గోయల్ కు అప్పగించారు. గత కొన్ని వారాలుగా పాశ్వాన్ ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు ఇటీవలే గుండె శస్త్ర చికిత్స జరిగింది. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి తన సహచరులు జేపీ నడ్డాతో కలిసి పాశ్వాన్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఒక గొప్ప వ్యక్తిని కోల్పొయామని మోదీ పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
చదవండి: కేంద్రమంత్రి పాశ్వాన్ కన్నుమూత