
ఢిల్లీ: నగరంలో ఓ పైలట్ వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. పైలెట్ మోహిత్ ప్రియదర్శిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మాల్స్‌కు వచ్చే యువతులను టార్గెట్ చేసిన మోహిత్.. స్పై కెమెరాతో యువతుల వీడియోలు తీస్తూ.. కీచకుడి అవతారం ఎత్తాడు. సిగరెట్ లైటర్ ఆకారంలో ఉన్న స్పై కెమెరాలతో వీడియోలు చిత్రీకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇటీవల ఢిల్లీలోని కిషన్‌గఢ్ ప్రాంతంలోని శని బజార్‌లో మోహిత్ లైటర్‌తో మహిళల వీడియోలను రికార్డ్ చేయడాన్ని ఓ యువతి గమనించింది. వెంటనే అప్రమత్తమైన ఆ మహిళ.. పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునేలోపే నిందితుడు పరారయ్యాడు. అనంతరం మార్కెట్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.
మోహిత్ ప్రియదర్శి.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్థారించారు. విచారణలో నిందితుడు ఓ ప్రముఖ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా పనిచేస్తున్నట్లు తేలింది. నిందితుడు ప్రియదర్శికి ఇంకా పెళ్లి కాలేదని తెలిపారు. మోహిత్ వద్ద నుంచి స్పై కెమెరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో మహిళలకు సంబంధించిన అనేక అభ్యంతరకర వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ప్రియదర్శికి ఇంకా పెళ్లి కాలేదని తెలిపారు.