వివాదంపై టీవీకే ఎమ్మెల్యే కనిమొళి సంతోష్‌ వివరణ | Officials in a plastic CHAIR | Sakshi
Sakshi News home page

వివాదంపై టీవీకే ఎమ్మెల్యే కనిమొళి సంతోష్‌ వివరణ

May 20 2026 1:47 PM | Updated on May 20 2026 3:07 PM

Officials in a plastic CHAIR

సాక్షి, చెన్నై :  తన పాత జ్యోతిష్య కార్యాలయంలో ప్రభుత్వ అధికారులతో నిర్వహించిన సమావేశం సోషల్‌ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీయడంతో, తమిళగ వెట్రి కళగం  మహిళా ఎమ్మెల్యే కనిమొళి సంతోష్‌ తీవ్రంగా స్పందించారు. ఈ వివాదంపై ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ సోషల్‌ మీడియా ట్రోల్స్‌కు గట్టి కౌంటర్‌ ఇచ్చారు. 

వివాదం ఏమిటంటే..? 
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూర్‌ పరిధిలోని గౌండంపాళయం నియోజకవర్గం నుంచి టీవీకే తరఫున కనిమొళి సంతోష్‌ విజయం సాధించారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె ప్రముఖ జ్యోతిష్యురాలిగా ప్రాచుర్యం పొందారు. ఇటీవల ఆమె ప్రజారోగ్యశాఖ అధికారులతో తన కార్యాలయంలో సమావేశమై, అందుకు సంబంధించిన మూడు ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఆ ఫొటోల్లో ఎమ్మెల్యే కనిమొళి పెద్ద లగ్జరీ సోఫాలో కూర్చోగా, ఆమెకు ఎదురుగా ప్రభుత్వ అధికారులు ప్లాస్టిక్‌ కురీ్చలలో కూర్చోవడం కనిపించింది. ప్రభుత్వ అధికారులను ఆమె అవమానించారంటూ నెటిజన్లు, ప్రతిపక్షాలు దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. 

ఎమ్మెల్యే కనిమొళి సంతోష్‌ వివరణ: 
ఈ వివాదంపై ఎక్స్‌ వేదికగా వీడియో విడుదల చేసిన ఎమ్మెల్యే, అందులోని అసలు నిజాన్ని  వివరించారు. తాను రాజకీయాల్లోకి రాకముందు చాలా ఏళ్లుగా జ్యోతిష్యురాలిగా ప్రజలను కలుస్తున్న కార్యాలయం అని, తన జీవిత ప్రయాణంలో అది ఎంతో ముఖ్యమైన స్థలంగా పేర్కొన్నారు. తన కొత్త ఎమ్మెల్యే ఆఫీస్‌ పనులు (పెయింటింగ్, ఇతర పనులు) ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కొత్త ఆఫీస్‌ పనులు పూర్తయ్యే వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పాత ఆఫీస్‌ నుంచే ప్రజల సమస్యలను, అధికారులను కలిసి వినతులను స్వీకరిస్తున్నానని తెలిపారు. తనకు ప్రజాసేవే ముఖ్యం, ఆఫీస్‌ ఎక్కడ ఉందనేది కాదని వివరించారు. తాను అధికారులను ఇంటికి పిలిపించుకుని, ప్లాస్టిక్‌ కుర్చీలలో కూర్చోబెట్టి అవమానించానని కొందరు కావాల నే ట్రోల్‌ చేస్తుండడం అవాస్తవంగా పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement