రోడ్డు ప్రమాదంలో ఇంజినీర్ల దుర్మరణం 

Odisha: Two Engineers Killed In Road Accident In Keonjhar - Sakshi

సాక్షి, భువనేశ్వర్‌: కెంజొహర్‌ జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీర్లు దుర్మరణం పాలయ్యారు. బాసుదేవ్‌పూర్‌ ప్రాంతంలో శనివారం ఉదయం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. జోడా నుంచి చంపువా వెళ్తుండగా బాసుదేవ్‌పూర్‌ వద్ద వెనుక నుంచి వచ్చిన ట్రక్కు దూసుకు పోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది.

ఘటనా స్థలంలో ఒకరు మృతిచెందగా.. చంపువా ప్రభత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇంజినీర్‌ మృతిచెందాడు. కెంజొహర్‌ జిల్లా కొడొగొడియా ప్రాంతంలో భారీ నీటి సరఫరా ప్రాజెక్టు నిర్మాణం సమీక్షించేందుకు వెళ్తూ ప్రమాదానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం. చంపువా ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
చదవండి: అమానుషం: భర్త కంట్లో కారం చల్లి.. కుమారుడితో కలిసి..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top