నితీష్‌ రాముడిగా, మోదీ రావణుడిలా.. కలకలం రేపుతున్న పోస్టర్లు | Nitish Kumar As Ram And PM Modi Ravana Poster Outside RJD Office | Sakshi
Sakshi News home page

నితీష్‌ రాముడిగా, మోదీ రావణుడిలా.. కలకలం రేపుతున్న పోస్టర్లు

Jan 14 2023 2:52 PM | Updated on Jan 14 2023 2:52 PM

Nitish Kumar As Ram And PM Modi Ravana Poster Outside RJD Office - Sakshi

వచ్చే ఎన్నికల్లో బిహార్‌ సీఎం నితీష్‌ కుమారే గెలుస్తారని చెప్పేలా...

బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ రాబోయే 2024 ఎన్నికల్లో ఆయన గెలుస్తారని చెప్పేలా ఏర్పాటు చేసిన పోస్టర్లు తీవ్ర కలకలం రేపాయి. పైగా ఆపోస్టర్లు రబ్రీ దేవి నివాసం వద్ద, ఆర్జేడి కార్యాలయం వెలుపల ఏర్పాటు మరింత వివాదానికి దారితీసింది. ఈ మేరకు ఆ పోస్టర్లలో మహాభారత, రామాయణలలో ప్రధానాంశాలతో తమ నాయకుడు నితీష్‌ కుమార్‌ ఎలా బీజేపీని ఓడిస్తాడో చూపిస్తున్నట్లుగా తెలియజేసేలా ఏర్పాటు చేశారు. తమ మహాఘట్‌బంధన్‌ నాయకుడు నితీష్‌ కుమార్‌ని కృష్ణుడు, రాముడిలా చూపిస్తూ..ప్రధాని నరేంద్ర మోదీని కంసుడు, రావణుడిలా చూపిస్తూ పోస్టర్లు పెట్టారు.

అంతేగాదు రావణుడిని రాముడు ఎలా ఓడించాడో, అలాగే కంసుడిని కృష్ణుడు ఎలా చిత్తుచేశాడో అలా మా నాయకుడు నితీష్‌ కుమార్‌ బీజేపీని గద్దే దింపుతాడని అని అర్ధం వచ్చేలా ఏర్పాటు చేశారు. ఆ పోస్టర్లపై ఛప్రా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనమ్‌ రాయ్‌ చిత్రంతో పాటు మహాగత్‌బంధన్‌ జిందాబాద్‌ నినాదాలు కూడా ఉన్నాయి. అయితే బీజేపీ ప్రతినిధి నవల్‌ కిషోర్‌ యాదవ్‌ మాయావతి, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ వంటి ప్రతిపక్ష నాయకులందరూ నితీష్ కుమార్‌లతో కలిసి ఏకమై వచ్చినా... ప్రధాని మోదీని ఓడించలేరు. ఆయన 2034 వరకు ప్రధానిగా అధికారంలోనే ఉంటారని ధీమాగా చెప్పారు.

ఈ పోస్టర్ల విషయమై స్పందించిన ఆర్జేడీ జాతీయ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ ..ఆ పోస్టర్లు ఎవరూ ఏర్పాటు చేశారో మాకు తెలియదు. మా కార్యాలయానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయినా బీజేపీని గద్దే దింపేందుకు ప్రతిపక్షాలన్ని ఏకమవుతాయని, ఆయన ఐక్య ప్రతిపక్షానికి ముఖంగా ఉంటారు. రైతులు, యువతకు వ్యతిరేకంగా ఉండే పార్టీతో మా నాయకుడు పోరాడుతారు. ప్రతి బిహారీ నితీష్‌  గెలవాలని కోరుకుంటాడు అని నమ్మకంగా చెప్పారు. బిహార్‌ విద్యా శాఖ మంత్రి రామ్‌చరిత మానస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి ఇబ్బందులో పడ్డ కొద్దిరోజుల్లో ఈ పోస్టర్ల ఘటన తెరపైకి రావడం గమనార్హం.

(చదవండి: ఆ పాటతో రాత్రికి రాత్రే స్టార్‌ సింగర్‌గా మారిన ఖైదీ! వెల్లువలా ఆఫర్లు)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement