బాలుడిపై ట్యూటర్‌ లైంగిక వేధింపులు | Nine-Year-Old Boy Allegedly Sexually Abused By Private Tutor | Sakshi
Sakshi News home page

బాలుడిపై ట్యూటర్‌ లైంగిక వేధింపులు

Dec 3 2020 2:02 PM | Updated on Dec 3 2020 2:30 PM

Nine-Year-Old Boy Allegedly Sexually Abused By Private Tutor - Sakshi

అగర్తల: విద్యార్థులకు విద్యాభోదన చేయాల్సిన టీచర్లే పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తొమ్మిదేళ్ల బాలుడిపై ఓ ప్రైవేట్‌ ట్యూటర్‌ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన త్రిపురలోని అగర్తలలో చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన దాదాపు పదిరోజుల తర్వాత ప్రైవేట్‌ ట్యూటర్‌ను ఇంద్రఘోష్‌(23)ను గుర్తించామని పోలీసులు బుధవారం తెలిపారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు నవంబర్‌ 30న కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న  నిందితుడి కోసం గాలింపు చేపడుతున్నామని త్వరలోనే అతన్ని అరెస్టు చేస్తామని  రామ్‌ నగర్‌ అవుట్‌పోస్ట్‌ ఇన్‌చార్జి బిస్వాజిత్‌ దాస్‌ వెల్లడించారు.

నవంబర్‌ 28న ఈ సంఘటన గురించి తెలుసుకున్న తరువాత చైల్డ్‌ లైన్‌ ప్రతినిధులు బాలుడి ఇంటికి వెళ్లారు. బాలుడు ఓ ప్రైవేటు ట్యూటర్‌ చేత లైంగిక వేధింపులకు గురయ్యాడని తెలుసుకున్నారు. ఈ విషయం గురించి ఎవరితోనై నా చెబితే తరువాత జరిగే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయని ట్యూటర్‌ బెదిరించడంతో, బాలుడు ఈ విషయాన్ని  తల్లిదండ్రులకు చెప్పలేదు. ఇది జరిగిన వారం రోజుల పాటు బాలుడు ట్యూషన్‌కు వెళ్లకపోవడంతో కారణమేమిటని తల్లిదండ్రులు గట్టిగా అడగడంతో జరిగిన విషయాన్ని తల్లికి చెప్పినట్లు  చైల్డ్‌ లైన్‌ సభ్యులు తెలిపారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 506 (క్రిమినల్ బెదిరింపులకు శిక్ష), పోక్సో చట్టం సెక్షన్ 5 (ఎమ్‌)(పీ) కింద పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement