ఆర్యన్‌ ఖాన్‌ కేసులో కీలక పరిణామం.. ఇద్దరు అధికారుల తొలగింపు

NCB Suspends Two Investigation Officers From Aryan Khan Drug Case - Sakshi

ముంబై: బాలీవుడ్‌ సీనియర్‌ హీరో షారూఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ నిందితుడిగా ఉన్న డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ఇద్దరు అధికారుల్ని, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో పక్కకు తప్పించింది. 

విశ్వ విజయ్‌ సింగ్‌, అశిష్‌ రాజన్‌ ప్రసాద్‌లు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్‌ ఇన్‌చార్జిగా, డిప్యూటీ ఇన్వెస్టిగేషన్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. అయితే వీళ్లిద్దరూ అనుమానిత కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలిందని, అందుకే వీళ్లను తప్పించినట్లు యాంటీ డ్రగ్‌ ప్రొబ్‌ ఏజెన్సీ (ఎన్‌సీబీ) స్పష్టం చేసింది. అయితే ఆ కార్యకలాపాలు ఏంటన్నవి ఎన్‌సీబీ వెల్లడించింది.

2021, అక్టోబర్‌ 3న ముంబై తీరంలో ఓ క్రూయిజ్‌ షిప్‌లో ఎన్సీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా.. ఆర్యన్‌ ఖాన్‌ అరెస్ట్‌ అయ్యాడు. దీంతో ఇదొక హై ప్రొఫైల్‌ కేసుగా వార్తల్లో నిలిచింది. డ్రగ్స్‌తో సంబంధం ఉందన్న ఆరోపణలతో..  ఆర్యన్‌తో పాటు మరో 19మందిపై కేసు నమోదు అయ్యాయి. వీళ్లలో ఆర్యన్‌, 17 మందికి బెయిల్‌ దొరికింది. ఇద్దరు ఇంకా జ్యూడీషియల్‌ కస్టడీలోనే ఉన్నారు.

చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక సాక్షి మృతి

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top