Mumbai Cruise Drug Case: హైడ్రోజన్‌ బాంబు వేయబోతున్నా కాస్కో!

Nawab Malik counter to Devendra Fadnavis says will drop Hydrogen bomb - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ స్టార్‌హీరో షారూఖ్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ నిందితుడుగా ఉన్న ముంబై క్రూయిజ్‌ డ్రగ్స్‌ కేసు రోజుకో పరిణామంతో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ కేసులో బీజేపీ, శివసేన,ఎన్‌సీపీ  ప్రభుత్వం మధ్య రగిలిన వార్‌ మరింత ముదురుతోంది. తనపై సంచలన ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు అదే స్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌.

రేపు (బుధవారం) హైడ్రోజన్‌ బాంబు వేస్తా.. డీ-గ్యాంగ్‌తో ఆయనకున్న అండర్ వరల్డ్ లింకులను తానూ బయటపెడతాను అంటూ నవాబ్ మాలిక్ ప్రకంపనలు సెగ రేపారు. ఫడ్నవిస్‌  తాజా ఆరోపణలపై విచారణకు తాను సిద్ధమే అంటూ ప్రతిసవాల్‌ విసిరారు. దీనికి సంబంధించి ఒక వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు.

ఇటీవల కాలంలో ఎన్సీబీ అధికారి సమీర్‌ వాంఖడేను టార్గెట్‌ చేసిన నవాబ్‌మాలిక్‌పై మరోసారి తీవ్ర విమర‍్శలకు దిగారు దేవేంద్ర ఫడ్నవిస్‌. నవాబ్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు దావూద్‌ గ్యాంగ్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. మంగళవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దావూద్‌ గ్యాంగ్ సభ్యుడి మధ్య జరిగిన భూ ఒప్పందానికి సంబంధించిన వివరాలను వెల్లడించడం దుమారాన్ని రేపింది. ముంబై పేలుళ్ల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న దోషుల దగ్గరి నుంచి నవాబ్‌ మాలిక్‌ చవగ్గా ఆస్తులను కొనుగోలు చేశారని, అసలు వారినుంచి భూమి ఎందుకు కొన్నారని ఫడ్నవిస్‌ను ప్రశ్నించారు. అంతేకాదు దీనిపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఎన్సీపీ అధినేత శరద్‌ పపవార్‌కు కూడా డాక్యుమెంట్లు అందిస్తానని ఫడ్నవిస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top