ఒకే వేదికపై రాహుల్‌, స్టాలిన్‌, తేజస్వి.. మండిపడిన బీజేపీ | MK Stalins Photo with Rahul Gandhi Tejashwi Yadav | Sakshi
Sakshi News home page

ఒకే వేదికపై రాహుల్‌, స్టాలిన్‌, తేజస్వి.. మండిపడిన బీజేపీ

Aug 28 2025 7:24 AM | Updated on Aug 28 2025 7:27 AM

MK Stalins Photo with Rahul Gandhi Tejashwi Yadav

పట్నా: బీహార్‌లో వివాదాస్పదమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌))కు వ్యతిరేకంగా బుధవారం రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ నిర్వహించిన ‘ఓటరు అధికార్ యాత్ర’లో డీఎంకే నేత ఎంకే స్టాలిన్ పాల్గనడం తీవ్ర చర్చలకు దారితీసింది. వివిధ పార్టీలు వీరి కలయికపై పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నాయి.

ఈ ముగ్గురు నేతల కలయికపై బీజేపీ మండిపడింది. దీనిని నిరాశాజనకమైన సమీకరణగా అభివర్ణించింది. కాగా బీహార్‌లో అడుగుపెట్టిన వెంటనే ఎంకే స్టాలిన్ ..రాహుల్, తేజస్వి యాదవ్‌తోపాటు తాను ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌  చేస్తూ..లాలూ ప్రసాద్ భూమి తనను పలకరించిందని, ఈ నేల ఓటు చోరీతో నిండిపోయిదని’ వ్యాఖ్యానించారు. అనంతరం బీజేపీ, డీఎంకేల మధ్య మధ్య మాటల యుద్ధం  మొదలయ్యింది.
 

స్టాలిన్‌ వ్యాఖ్యలను డీఎంకే ఎంపీ కనిమొళి కూడా సమర్థించారు. ‘ఓటరు అధికార్ యాత్ర’ను ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి చేపట్టిన ఉద్యమంగా అభివర్ణించారు. ఈ ముగ్గురు నేతల ఫోటోను షేర్ చేసిన కనిమొళి వారిని ‘భారతదేశ భవిష్యత్తు’ అని పేర్కొన్నారు. కలిసికట్టుగా మనం లేస్తాం.. కలిసి ప్రతిఘటిస్తాం. బీజేపీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా గళమెత్తడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి బీహార్‌లో ఇండియా కూటమితో చేతులు కలుపుతున్నామని ఆమె ప్రకటించారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement