అదృష్టం అంటే నీదిరా బాబు!

నెటిజన్లు తమకు ఆనందం వచ్చినా, బాధ కలిగినా వెంటనే తోటి నెటిజన్లతో పంచుకోవటం ప్రస్తుతం పరిపాటిగా మారింది. వింతగా అనిపించిన కొన్ని విషయాలు ఎంత చిన్నవైనా సోషల్ మీడియాలో వైరల్‌గా మారటం కూడా మామూలై పోయింది. తాజాగా ఓ మ్యాగీ న్యూడిల్స్ ప్రేమికుడి పోస్టు నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాను కొనుక్కున్న మ్యాగీ న్యూడిల్స్ ప్యాకెట్‌లో రెండు మసాలా ప్యాకెట్లు రావటంతో శశ్వంత్ ద్వివేదీ అనే వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ‘‘ నేను కొన్న మ్యాగీ ప్యాకెట్‌లో రెండు మసాలా ప్యాకెట్లు వచ్చాయి. ఒట్టు.. నేను అబద్ధం ఆడటం లేదు’’ అని పేర్కొన్నాడు. ('ఇది తయారు చేసినవాడిని చంపేస్తా’)
ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశాడు. దీంతో ఈ వార్త వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు అతడి అదృష్టంపై తమ అసూయను వెళ్లగక్కారు. ‘‘ నిన్ను చూస్తుంటే నా కడుపు మండుతోంది.. దాన్ని మ్యాజిక్ మసాలా అనడానికి ఇదే కారణం.. నీ అదృష్టాన్ని ఉద్ధేశించి ఏమైనా ప్రసంగిస్తావా?.. అదృష్టం అంటే నీదిరా బాబు!’’ అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి