బుర్ఖాలో అక్కడికి పురుషుడు.. ఎలా గుర్తుపట్టారంటే? | Man Allegedly Caught Begging While Wearing Burqa At Ajmer Sharif Dargah | Sakshi
Sakshi News home page

బుర్ఖాలో అక్కడికి పురుషుడు.. ఎలా గుర్తుపట్టారంటే?

Aug 22 2026 3:19 PM | Updated on Aug 22 2026 3:45 PM

 Man Allegedly Caught Begging While Wearing Burqa At Ajmer Sharif Dargah

అజ్మీర్ షరీఫ్ దర్గాలో బుర్ఖా ధరించి భిక్షాటన చేస్తున్న ఓ వ్యక్తి పట్టుబడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇటీవల అజ్మీర్‌లోని ప్రఖ్యాత ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గాలో జరిగిన మహన్నా ఛఠి సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.

జాతీయ మీడియా అందించిన వివరాల ప్రకారం.. ఆ వ్యక్తి బుర్ఖా ధరించి దర్గా ప్రాంగణంలోకి ప్రవేశించి, భక్తుల వద్దకు వెళ్లి డబ్బులు అడిగాడు. అతడి గొంతును గమనించిన దర్గా కమిటీ సిబ్బందికి అనుమానం వచ్చింది. దీంతో వారు అతడిని ఆపి బుర్ఖా తొలగించగా, లోపల ఉన్నది పురుషుడని గుర్తించారు.

అనంతరం దర్గా కమిటీ సిబ్బంది అతడిని సంబంధిత పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ అతడిని విచారించారు. విచారణ అనంతరం అతడిని విడిచిపెట‍్టినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌ అవుతోంది. అయితే ఆ వ్యక్తి బుర్ఖా ధరించి దర్గాలోకి ఎందుకు ప్రవేశించాడు? అక్కడ భిక్షాటన చేయడానికి కారణమేంటి? అనే విషయాలపై ఎలాంటి వివరాలు బయటకు రాలేదు.

కావడ్ మేళాలో యూట్యూబర్ భిక్షాటన ప్రయోగం
ఇటీవల యాచకులకు సంబంధించిన ఓ ‍ప్రయోగం జరిగింది. ఆ వీడియో కూడా బాగా వైరల్‌ అయింది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జరిగిన కావడ్ మేళాలో ఓ యూట్యూబర్ సామాజిక ప్రయోగం నిర్వహించినట్లు సమాచారం. తన స్నేహితుడికి బిచ్చగాడి వేషం వేయించి ఈ ప్రయోగం నిర్వహించగా, 8 గంటల్లో సుమారు రూ. 4,000 సేకరించినట్లు వారిద్దరూ తెలిపారు.

వేషం మార్చుకున్న యూట్యూబర్ స్నేహితుడు వెళ్లి డబ్బులు అడిగిన దృశ్యాలను ఆ వీడియోలో చూపించారు. వారి వివరాల ప్రకారం.. మొదటి 4 గంటల్లో సుమారు రూ.800 లభించగా, మిగిలిన 4 గంటల్లోనే ఎక్కువ మొత్తంలో డబ్బు సేకరించినట్లు తెలిపారు.

ప్రయోగం ముగిసిన తర్వాత, సేకరించిన డబ్బును మేళాలో అవసరంలో ఉన్న ప్రజలకు సహాయం చేసేందుకు ఉపయోగించాలని భావిస్తున్నట్లు వారిద్దరూ తెలిపారు. ఈ ప్రయోగాన్ని అనుకరించవద్దని వీక్షకులను కోరారు. 

ఇదీ చదవండి: 15 ఏళ్లుగా గాలించి.. వృద్ధుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement