Live Updates
డీకే శివకుమార్ అనే నేను..
సీఎంగా డీకే శివకుమార్ ప‍్రమాణం
- ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణం
- డీకే శివకుమార్‌తో ప్రమాణం చేయించిన గవర్నర్ థావర్‌చంద్
- మరో 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం
- కర్ణాటక డిప్యూటీ సీఎంగా పరమేశ్వర ప్రమాణ స్వీకారం
- డీకే శివకుమార్‌కు శుభాకాంక్షల వెల్లువ
కాసేపట్లో డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం
- ప్రమాణ స్వీకార వేదికకు వచ్చిన డీకే శివకుమార్
- కాసేపట్లో ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం
- బెంగళూరులోని లోక్ భవన్‌లో కార‍్యక్రమం
- డీకే శివకుమార్‌తో ప్రమాణం చేయించనున్న గవర్నర్ థావర్‌చంద్
- మరో 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం
- వారిలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర కూడా
తల్లిని కలిసిన డీకే శివకుమార్

- కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న డీకే శివకుమార్ తన తల్లి గౌరమ్మను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
దేవేగౌడను కలిసిన డీకే
- దేవేగౌడను కలిసిన డీకే
- నేడు కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం
- కర్ణాటకలో కీలక నేతలకు డీకే ఆహ్వానం
- మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడను కలిసి ఆహ్వానించిన డీకే
#WATCH | Karnataka CM designate DK Shivakumar meets Former PM & JD(S) National President HD Deve Gowda ahead of being sworn in as the CM later today.
(Source: DK Shivakumar's Office) pic.twitter.com/k6b7bOP1Pt— ANI (@ANI) June 3, 2026
డిప్యూటీ సీఎంగా పరమేశ్వర
- కర్ణాటక డిప్యూటీ సీఎంగా మంత్రి పరమేశ్వర
- ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని ధృవీకరించిన సిద్ధరామయ్య.
- సిద్దరామయ్య మంత్రి వర్గంలో హోం మంత్రిగా పనిచేసిన పరమేశ్వర
Former Karnataka CM and Congress leader Siddaramaiah confirms that Congress leader G Parameshwara, who was the state Home Minister in Siddaramaiah's Cabinet, will take oath as the state's Deputy Chief Minister at today's swearing-in ceremony at Lok Bhavan. pic.twitter.com/YHfD7a6BjX
— ANI (@ANI) June 3, 2026
సీడబ్ల్యూసీ సభ్యుడిగా సిద్దరామయ్య..
- కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడిగా సిద్ధరామయ్య నియామకం.
- పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక సంస్థలో ఆయనకు చోటు కల్పిస్తూ ఏఐసీసీ అధికారిక ప్రకటన
- సిద్దరామయ్యకు జాతీయ స్థాయిలో కీలక బాధ్యత అప్పగించడం విశేషం
సిద్ధరామయ్య బాటలోనే డీకే
మాజీ సీఎం అడుగుజాడల్లోనే డీకే శివకుమార్ నడుస్తారని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు చెప్పారు. డీకే శివకుమార్ ప్రమాణస్వీకారానికి హాజరయేందుకు ఆయన బెంగళూరు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. "గత మూడేళ్లుగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. కాంగ్రెస్ రూపొందించిన విధానాలనే డీకే శివకుమార్ కూడా అనుసరిస్తారు. కాంగ్రెస్ విధానాలు కేవలం ఒకటి లేదా రెండు సంవత్సరాలకు మాత్రమే పరిమితం కావు, అవి పూర్తి ఐదేళ్ల కాలానికి ఉద్దేశించినవి. ఆయన ఆ విధానాలను ఖచ్చితంగా సమర్థవంతంగా అమలు చేస్తార''ని చెప్పారు.
యడియూరప్ప ఇంటికి డీకే
కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ బుధవారం బెంగళూరులో ఉదయం మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బీఎస్ యడియూరప్పను కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. "యడియూరప్ప రాష్ట్రానికి మార్గనిర్దేశం చేశారు. రాష్ట్రం కోసం కృషి చేశారు. మనమందరం కలిసి పనిచేయాలని'' ఆయనను కోరినట్టు చెప్పారు. అంతకుముందు తమ పార్టీకి చెందిన మాజీ సీఎం సిద్ధరామయ్య, మంత్రి జి. పరమేశ్వరను డీకే కలిశారు.
#WATCH | Bengaluru | Karnataka CM designate DK Shivakumar arrives at the residence of BJP leader & former CM BS Yediyurappa, ahead of swearing in ceremony of Karnataka Cabinet pic.twitter.com/YIhKuOtoWA
— ANI (@ANI) June 3, 2026
డీకేకు వీహెచ్ అభినందనలు
కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అభినందనలు తెలిపారు. కర్ణాటకలో సుపరిపాలన అందించాలని ఆకాంక్షించారు. హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని సిద్దరామయ్య గౌరవించారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని హనుమంతరావు వ్యక్తం చేశారు.
#WATCH | Hyderabad, Telangana: On the commercial LPG price hike, Congress leader V. Hanumantha Rao says, "Finally, in the interest of people of Karnataka, Rahul Gandhi and Mallikarjun Kharge they too ka decision, which was accepted by Siddaramaiah. The party high command has… pic.twitter.com/7KOBPx1yBX
— ANI (@ANI) June 3, 2026
డీకే ఇంటి వద్ద సందడి
కర్ణాటక ముఖ్యమంత్రిగా ఈ రోజు సాయంత్రం డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో బెంగళూరులోని ఆయన ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. డీకే అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన నివాసానికి తరలివచ్చారు. వారందరికీ డీకే శివకుమార్ అభివాదం చేశారు.
#WATCH | Karnataka CM designate DK Shivakumar greets his supporters who have gathered outside his residence in Bengaluru. He will take the oath as the CM of Karnataka today evening. pic.twitter.com/MNN6DNQLMi
— ANI (@ANI) June 3, 2026
సిద్ధరామయ్యను కలిసిన డీకే
కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ బుధవారం బెంగళూరులో ఉదయం మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను, పార్టీ నాయకుడు జి. పరమేశ్వరను కలిశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వారిని స్వయంగా శివకుమార్ ఆహ్వానించారు.
#WATCH | Bengaluru | Karnataka CM-designate DK Shivakumar meets former CM Siddaramaiah at his residence ahead of swearing-in ceremony
(Source: DK Shivkumar's office) pic.twitter.com/hQj7fWsdaO— ANI (@ANI) June 3, 2026
డీకే ఆహ్వాన పత్రిక ఇదే..
- డీకే ఆహ్వాన పత్రిక ఇదే..
- డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక
- సోషల్ మీడియాలో వైరల్
The invitation card for Karnataka CM-designate DK Shivakumar's oath-taking ceremony states that the "oath of office and secrecy will be administered at the Glass House, Lok Bhavan, Bengaluru" at 4.05 pm today. pic.twitter.com/rHQEB30XzL
— ANI (@ANI) June 3, 2026
కేబినెట్ ఇదేనా?..
- మంత్రివర్గం కూర్పు..
- కాంగ్రెస్ వర్గాలు అంచనా మేరకు..
- సీనియర్ నేతలు కేజే జార్జ్, రామలింగారెడ్డి, ఎంబీ పాటిల్, ఈశ్వర ఖండ్రె, జి.పరమేశ్వర్,
- సతీశ్ జార్కిహొళి, కేహెచ్ మునియప్ప, ఎస్‌ఎస్ మల్లికార్జున్, యూటీ ఖాదర్, హెచ్‌కే పాటిల్,
- హెచ్‌సీ మహదేవప్ప, శివానంద పాటిల్, భైరతి సురేశ్, చెలువరాయస్వామిల పేర్లు.
- ఒక్కరి కంటే ఎక్కువ మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టే అవకాశం.
- ఒక దళిత నేతను తప్పనిసరిగా ఉప ముఖ్యమంత్రి పదవి
- జి.పరమేశ్వర, ప్రియాంక్ ఖర్గేలో ఒకరికి ఈ పదవి దక్కేందుకు ఆస్కారం.
- సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర కూడా మంత్రి పదవి
- కొత్త స్పీకర్‌గా ఆర్‌వీ దేశపాండే, హెచ్‌కే పాటిల్ పేర్లు ప్రస్తావన
- కర్ణాటక పీసీసీ అధ్యక్ష పదవిని సతీశ్ జార్కిహొళికి ఇస్తామని ప్రతిపాదించగా, ఆయన మంత్రి పదవిని కోరుతున్నారు.
- పీసీసీ అధ్యక్షుడిగా బీకే హరిప్రసాద్ పేరు కూడా తెరపైకి వచ్చింది.
నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం..
- నేడు సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం.
- కర్ణాటక ముఖ్యమంత్రిగా నేడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.
- లోక్‌భవన్‌లో సాయంత్రం 4.05 గంటలకు నిరాడంబరంగా కార్యక్రమం
- ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు పూర్తి.
- డీకే శివకుమార్‌తోపాటు మరి కొందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం
- కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు సిద్ధరామయ్య రాజీనామా
- ఈనెల 30న డీకే శివకుమార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నిక.
- ప్రమాణ స్వీకారానికి ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్, రణదీప్‌సింగ్ సూర్జేవాలా హాజరయ్యే అవకాశం
- కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమి పాలిత రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలను కూడా ఆహ్వానం.


