మహిళల్ని ముందు, వెనుక వీడియోలు తీసి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తారా? | Karnataka High Court Slams Man For Secretly Filming Women On Bengaluru Metro, Dismisses Plea To Quash Case | Sakshi
Sakshi News home page

మహిళల్ని ముందు, వెనుక వీడియోలు తీసి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తారా?

Apr 28 2026 8:16 AM | Updated on Apr 28 2026 8:33 AM

Karnataka High Court refuses to quash proceedings against man accused of running ‘Metro Chicks’ Instagram page

యశవంతపుర: బెంగళూరులో నమ్మ మెట్రో రైళ్లలో ప్రయాణించే యువతులు, మహిళ ఫోటోలను రహస్యంగా తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ వికృతానందం పొందే నిందితునికి హైకోర్టులో మందలింపు దక్కింది. తనపై పెట్టిన కేసును రద్దు చేయాలని వేసిన ఫిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.  

నిందితుడు బీకే దిగంత్‌.. బెంగళూరు మెట్రో చిక్స్‌ అనే ఇన్‌స్టా ఖాతాలో ఈ ఫోటోలు, వీడియోలను పోస్టు చేసేవాడు. గత ఏడాది మేలో బనశంకరి పోలీసులు విచారణ జరిపి అతన్ని అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో తనపై కేసు చెల్లుబాటు కాదని, కొట్టేయాలని నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. 

ఈ అర్జీని విచారించిన న్యాయమూర్తి.. నిందితునిపై భగ్గుమన్నారు. మహిళలను ఎక్కడా సురక్షితంగా ఉండనివ్వరా? అని దిగంత్‌ను నేరుగా ప్రశ్నించారు. ఇలా చేయడం చూస్తే నీకు మానవత్వం ఉందా? అంటూ అర్జీని కొట్టివేశారు. 

మహిళలను ముందు, వెనుక నుంచి వీడియో తీసి ఎడిట్‌ చేసి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేస్తారా?, మీరు ఎలాంటి మనుషులు అని జడ్జి ఆగ్రహించారు. నిందితుని న్యాయవాది వాదిస్తూ, మహిళలు ఎవరూ ఫిర్యాదు చేయలేదు, పోలీసులు సుమోటో కేసుగా నమోదు చేసుకున్నారు. ఇక్కడ ఎలాంటి నేరానికి పాల్పడలేదని అన్నారు. అయితే సాంకేతిక అంశాలను చూపించి తప్పించుకోలేదని న్యాయమూర్తి చురకలు ముట్టించారు. కొన్ని విషయాలలో  నైతికత, భద్రత ముఖ్యమన్నారు. మహిళల అనుమతి లేకుండా అశ్లీలంగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయడమే పెద్దనేరమని న్యాయమూర్తి పేర్కొన్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement