టీకాల కోసం 100 కోట్ల ‘కాంగ్రెస్‌’ నిధులు

Karnataka Congress Drafts 100 Crore Plan To Procure Covid Vaccines - Sakshi

బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, ఎంపీలు తమ స్థానిక ప్రాంత అభివృద్ధి(ఎల్‌ఏడీ) నిధి నుంచి రూ.100 కోట్లను కోవిడ్‌ టీకా కొనుగోలుకు ఉపయోగి స్తామని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ శాసనసభాపక్ష నేత సిద్దరామయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ బారి నుంచి ప్రజలను కాపాడేందుకు టీకా కూడా ఇవ్వలేకపోవడం విచారకరమన్నారు. అందుకే, రాష్ట్రంలోని తమ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కలిసి దాదాపు 95 మంది కనీసం రూ.కోటి ఎల్‌ఏడీ నిధులను టీకా కొనుగోలుకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top