మరోసారి 36 ఉపగ్రహాలు ప్రయోగానికి ‘వన్‌వెబ్‌’ ఏర్పాట్లు

Isro to launch 36 OneWeb internet satellites on LVM-3 - Sakshi

న్యూఢిల్లీ: ఒకేసారి 36 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు గ్లోబల్‌ కమ్యూనికేషన్స్‌ నెట్‌వర్క్‌ సంస్థ వన్‌వెబ్‌ సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఇస్రో వాహక నౌక మార్క్‌–3 నుంచి ఈ ఏడాది మార్చి తొలివారంలో ఈ ప్రయోగం చేపట్టనున్నారు.

36 ఉపగ్రహాలు తమ ఫ్యాక్టరీ నుంచి బయలుదేరాయని, వాటి గమ్యస్థానం భారత్‌ అంటూ వన్‌వెబ్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ మాసిమిలియానో లాడోవెజ్‌ ట్వీట్‌ చేశారు. వన్‌వెబ్‌ సంస్థ గత అక్టోబర్‌ 22న శ్రీహరికోటలో ఇస్రో వాహక నౌక ఎల్‌వీఎం–3 నుంచి 36 శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రయోగించడం తెలిసిందే. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top