12 రాష్ట్రాల్లో యాక్టివ్‌గా ఐసిస్‌: ఎన్‌ఐఏ

ISIS Active 12 States In India Says NIA - Sakshi

న్యూఢిల్లీ: ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో యాక్టివ్‌గా ఉన్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తెలిపింది. వాటిల్లో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు ‌కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, రాజస్థాన్‌, బిహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రాల్లో ఐసిస్‌ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి కూడా నిన్న రాజ్యసభలో ఇదే విషయాన్ని వెల్లడించారు.

దక్షిణాది రాష్ట్రాల్లోని యువత ఐసిస్‌వైపు ఆకర్షితులవుతున్నట్టు నిఘా వర్గాల ద్వారా తెలిసిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఐసిస్‌ సానుభూతిపరులపై ఇటీవల 17 కేసులు నమోదైనట్టు వెల్లడించారు. 122 మంది నిందితులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా  ఐసిస్‌ తమ సిద్ధాంతాలను ప్రచారంయువతకు గాలం వేస్తోందని తెలిపారు. ఉగ్ర సంస్థల కార్యకలపాలపై నిఘా కొనసాగుతోందని మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. 
(చదవండి: పాతబస్తీలోని వ్యభిచారగృహంపై పోలీసుల దాడి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top