ఢిల్లీకి రెడ్‌ అలర్ట్‌.. తెలంగాణలో ఐదు రోజులు వానలే.. | IMD Rain Red Alert To Delhi And Telangana Rains Update | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి రెడ్‌ అలర్ట్‌.. తెలంగాణలో ఐదు రోజులు వానలే..

Jul 9 2026 10:33 AM | Updated on Jul 9 2026 11:08 AM

IMD Rain Red Alert To Delhi And Telangana Rains Update

ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. ఢిల్లీలో పలు కాలనీలు జలమయమయ్యాయి. దీంతో, ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఢిల్లీ, హర్యానాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు.. తెలంగాణలో కూడా రానున్న ఐదు రోజుల పాటు మోసర్తు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ ఓ ప్రకటనలో పేర్కొంది.

​కాగా, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా రోడ్లపై మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. అలాగే, 60 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షం కారణంగా రైళ్ల రాకపోకలు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు.. ఐఎండీ ఢిల్లీ, హర్యానాకు రెయిన్ రెడ్ అలర్ట్.. యూపీ, ఉత్తరాఖండ్ , కేరళకు ఆరెంజ్ అలర్ట్ విధిస్తూ హెచ్చరికలు జారీ చేసింది.

ఇదిలా ఉండగా.. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు నుంచి ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నదని హెచ్చరించింది. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement