విజిటింగ్‌ ఫ్యాకల్టీ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

IIEST Shibpur, MANIT Bhopal Faculty Recruitment 2021 Full Details Here - Sakshi

ఐఐఈఎస్‌టీ, శిబ్‌పూర్‌లో తాత్కాలిక, విజిటింగ్‌ ఫ్యాకల్టీ పోస్టులు
శిబ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(ఐఐఈఎస్‌టీ).. ఒప్పంద ప్రాతిపదికన విజిటింగ్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (బెంగళూరు రైల్‌ వీల్‌ ఫ్యాక్టరీలో అప్రెంటిస్‌లు.. ఇక్కడ క్లిక్‌ చేయండి)

► మొత్తం పోస్టుల సంఖ్య: 30
► విభాగాలు: ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, మెటలర్జీ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజనీరింగ్, మైనింగ్‌ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, టౌన్‌ అండ్‌ రీజినల్‌ ప్లానింగ్, హ్యూమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్, మ్యాథమేటిక్స్‌ తదితరాలు.

► తాత్కాలిక ఫ్యాకల్టీ(టెంపరరీ): అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: దరఖాస్తు చేసే నాటికి 60ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.75,000 వరకు చెల్లిస్తారు.

► విజిటింగ్‌ ఫ్యాకల్టీ: అర్హత: పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు బోధన/రీసెర్చ్‌లో సుదీర్ఘ అనుభవం ఉండాలి. వయసు: దరఖాస్తు చేసే నాటికి 68ఏళ్లు మించకూడదు. జీతం: నెలకు రూ.1,00,000 వరకు చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, పర్సనల్‌ డిస్కషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 31.08.2021

► వెబ్‌సైట్‌: www.iiests.ac.in


ఎంఏఎన్‌ఐటీ, భోపాల్‌లో 107 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

భోపాల్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఏఎన్‌ఐటీ).. వివిధ విభాగాల్లో ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (యూనియన్‌ బ్యాంకులో.. స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు)

► మొత్తం పోస్టుల సంఖ్య: 107

► విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్, కెమికల్, కంప్యూటర్‌ సైన్స్, హ్యూమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌ తదితరాలు.

► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.

► వేతనం: నెలకు రూ.70,900 నుంచి రూ.1,01,500 వరకు చెల్లిస్తారు.

► ఎంపిక విధానం: క్రెడిట్‌ పాయింట్‌ స్కోర్, రీసెర్చ్‌/అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థుల్ని ప్రజంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

► ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 15.09.2021 

► దరఖాస్తును ది రిజిస్ట్రార్, ఎంఏఎన్‌ఐటీ, భోపాల్‌–462003 చిరునామకు పంపించాలి.

► వెబ్‌సైట్‌: http://www.manit.ac.in

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top