12 ఏళ్లుగా భార్యను గదిలో బంధించిన భర్త.. ఎందుకంటే! | Sakshi
Sakshi News home page

12 ఏళ్లుగా భార్యను గదిలో బంధించిన భర్త.. ఎందుకంటే!

Published Sat, Feb 3 2024 10:02 AM

Husband locks Up Wife In House For 12 years in Mysuru - Sakshi

బెంగళూరు: కట్టుకున్న భార్యపట్ల అమానవీయంగా ప్రవర్తించాడో భర్త. అర్థం లేని అనుమానాలతో ఆమెను గృహ నిర్బంధంలో బంధించాడు. కనీసం వాష్‌రూమ్‌ సదుపాయం లేని ఓ గదిలో ఉంచి తాళం వేశాడు. తన పిల్లలను కూడా కలవనివ్వలేదు. ఒకటి కాదు రెండు దాదాపు గత 12 ఏళ్లుగా భార్యను ఇలాగే వేధిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు శాడిస్టు భర్త. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

ఈ దారుణం చుట్టు పక్కల వాళ్లకు తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ మహిళకు బయటకు తీసుకువచ్చి జరిగిన విషయం గురించి తెలుసుకొని నివ్వెర పోయారు. భర్త ఏ పనిమీద బయటకు వెళ్లినా తనను ఇంట్లో ఉంచి తాళం వేసి వెళ్తాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. పిల్లలతో స్వేచ్ఛగా మాట్లాడనివ్వకుండా, పదే పదే కొట్టేవాడని చెప్పింది. గత 12 ఏళ్లుగా మానసిక క్షోభకు గురి చేశాడని, ఇంట్లోనే బంధించి ఇంటిని జైలుగా మార్చాడని పేర్కొంది. చాలా కాలంగాచి ఈ బాధతో కుంగిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది.

తనను బంధించిన గదిలోనే ఒక చిన్న పెట్టెలో కాలకృత్యాలు తీర్చుకొనే దానినని బాధితురాలు వాపోయింది. విషయం తెలిసిన పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని ఈ విషయమై కౌన్సెలింగ్‌ ఇచ్చారు. భర్తపై ఫిర్యాదు చేయడానికి బాధితురాలు నిరాకరించింది. ఇకపై అతడికి విడాకులు ఇచ్చి పుట్టింట్లో ఉంటానని తెలిపింది. కాగా అతడికి బాధితురాలు మూడో భార్య మొదట రెండు పెళ్లిళ్లు అయ్యాయి. కానీ అతడి వేధింపులకు తాళలేక వారిద్దరూ వదిలేసి వెళ్లిపోయారు. వీరికి ఇద్దరు పిల్లల

 
Advertisement
 
Advertisement