సీనియర్‌ సిటిజన్లకు భారీ ఊరట | FM proposes to abolish need to file IT returns for senior citizens | Sakshi
Sakshi News home page

సీనియర్‌ సిటిజన్లకు భారీ ఊరట

Feb 1 2021 12:48 PM | Updated on Feb 1 2021 5:10 PM

FM proposes to abolish need to file IT returns for senior citizens - Sakshi

సాక్షి,  న్యూఢిల్లీ :  లోక్‌సభలో  కేంద్ర ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సీనియర్‌ సిటిజన్లకు భారీ ఊరట కల్పించారు. 75 ఏళ్ల వయసు పైబడిన వారికి ఆదాయ పన్ను దాఖలులో మినహాయింపునిచ్చారు. ఈ బడ్జెట్‌ ప్రతిపాదనల్లో ఇది చాలా కీలకమైందని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. దీంతోపాటు ఆన్‌ఐఆర్‌లకు డబుల్‌ టాక్సేషన్‌నుంచి ఊరటనిచ్చారు. అయితే ఈసారి బడ్జెట్‌లో ఆదాయ పన్నులపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో 2021-22 బడ్జెట్‌పై భారీ స్థాయిలో ఆశలు పెట్టుకున్న మధ్యతరగతి ఉద్యోగులకు నిరాశే మిగిలింది. 

పన్ను రిటర్నులను రీఓపెన్ చేసే సమయం 6 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు కుదిస్తున్నట్టు ఆమె వెల్లడించారు.  దీంతో పాటు మరికొన్ని పన్నుచెల్లింపు ప్రక్రియ చెల్లింపు సరళీకరణ చర్యలను ప్రకటించారు. దీంతోపాటు స్టార్టప్‌లకు ట్యాక్స్ మినహాయింపు మరో ఏడాది  పొడిగిస్తున్నట్టు తెలిపారు. 

కాగా పెన్షన్, వడ్డీ ఆదాయం మాత్రమే ఉంటే 75 ఏళ్లు, అంతుకు పైబడిన  సినీయర్‌ సిటిజన్లకు టాక్స్‌ ఫైలింగ్ నుంచి మినహాయింపునిచ్చారు. అలాగే ఎన్నారై పెట్టుబడు దారులను ఆకర్షించేందుకు సరికొత్త వ్యూహాన్ని ప్రకటించారు. ఎన్నారైలు భారత్‌లో ఉండే గడువును 182 రోజుల నుంచి 120 రోజులకు కుదించారు. గత బడ్జెట్‌లో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ తొలగించామని పేర్కొన్న ఆమె ఫేస్‌లెస్ ఇన్‌కంట్యాక్స్ అప్పిలైట్ ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు ప్రతిపాదించారు.  2014లో 3.31 కోట్ల నుంచి 2020 నాటికి పన్ను చెల్లింపుదారులు 6.48 కోట్లకు పెరిగారని ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement