ఆడపిల్ల పుట్టిందని ఏనుగును తెప్పించి... ఆ తండ్రి చేసిన పనికి ఊరంతా షాకయ్యారు!

Father Celebrate Birth Of Girl Taking Out Procession On Elephant In Kolhapur Of Maharashtra - Sakshi

ముంబై: గతంలో ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావించి తల్లి గర్భంలో ఉన్నప్పుడో లేదా పురిటిలోనే చంపిన ఘటనలు బోలెడు చూశాం. కాలం మారుతోంది.. ఇటీవల తమ ఇంట ఆడపిల్ల పుడితే అదృష్టంగా భావించి కుటుంబాలు వేడుకలు చేసుకుంటున్నాయి. తాజాగా తమ వంశంలో చాలా సంవత్సరాల తర్వాత ఆడపిల్ల పట్టిందని సంబరాలు చేసుకోవడంతో పాటు ఆ చిన్నారిని తమ ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఘనంగా స్వాగతం పలికింది ఓ కుటుంబం. దీన్ని చూసిన ఊరు ప్రజలంతా షాకయ్యారు. ఈ అరుదైన ఈ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా పచ్‌గావ్‌లో చోటుచేసుకుంది.

ఎ‍ప్పటికీ గుర్తుండిపోయేలా... ఏనుగును పిలిపించి
వివరాల్లోకి వెళితే.. పాచ్‌గావ్‌కు చెందిన గిరీష్‌పాటిల్‌, సుధ దంపతులకు ఐదు నెలల కిందట కుమార్తె పుట్టింది. ఆ చిన్నారికి ఆప్యాయంగా ‘ఐరా’ అని పేరు పెట్టారు. ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లిన తన భార్యను శనివారం తొలిసారిగా తన ఇంటికి తీసుకొచ్చాడు. అయితే గిరీష్‌ వంశంలో దాదాపు 35 ఏళ్ల తర్వాత ఈ ఆడపిల్ల పుట్టింది. ఈ ఆనందాన్ని ఎప్పటికీ గుర్తిండిపోయేలా ఉండాలని ప్లాన్‌ చేశాడు. అందుకోసం తన భార్య, పాపను గుజరాత్‌లోని హత్తివరోన్ నుంచి పచ్‌గావ్‌కు తీసుకొచ్చి.. ఘనస్వాగతం పలికాడు. 

ఊరిపొలిమేర నుంచి డప్పువాయిద్యాలు ఏర్పాటు చేసి పట్టణ శివారు నుంచి ఏనుగుపై తన కూతురిని ఇంటికి తీసుకెళ్లాడు. చాలా ఏళ్ల తరవాత తమ ఇంట  ఆడపిల్ల పట్టడంతో పాటిల్‌ కుటుంబసభ్యులు సంబరాలు జరుపుకున్నారు. గిరీశ్ పుణెలో సాఫ్ట్‌వేర్ ఇంజినీ‌ర్‌గా పనిచేస్తోన్న గిరీశ్.. బంధువులు, ఇరుగుపొరుగు వారిని ఆహ్వానించి భోజనాలు ఏర్పాటు చేశారు. కాగా గతేడాది కూడా మహారాష్ట్రలోని పుణేకు చెందిన ఫ్యామిలీ సైతం ఏకంగా హెలికాప్టర్‌ను బుక్ చేసి ఔరా అనిపించిన సంగతి తెలిసిందే.

చదవండి: Viral Video: తల్లి కోసం భగీరథుడిలా.. ఆ 14 ఏళ్ల బాలుడు..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top