యజమానికి కాసులు కురిపిస్తున్న గొర్రె.. మేళతాళాలతో ఊరేగింపుగా..

Demand Increases For Goat In Karnataka - Sakshi

సాక్షి, మండ్య (కర్ణాటక): మామూలుగా ఒక గొర్రె రూ. 25–30 వేలు పలికితే గొప్ప. మళవళ్లి తాలూకా దేవీపుర గ్రామానికి చెందిన సణ్ణప్ప అనే వ్యక్తి చిత్రంలోని ఈ గొర్రెను పెంచాడు. రెండేళ్ల క్రితమే రూ. 1.5 లక్షలు ఖర్చు పెట్టి కొన్నాడు. ఇప్పటివరకు అనేక పిల్లలు కూడా పుట్టి మంచి ఆదాయం పొందాడు.

ఇప్పుడీ గొర్రెకు నాలుగేళ్లు.  బీదరకోటె గ్రామవాసి కృష్ణగౌడ గొర్రె కథ విని దేవీపురకు వచ్చి రూ.1.91 లక్షలు చెల్లించి దీన్ని కొనుగోలు చేశాడు. మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు.    

చదవండి: కూతురిపై ఆరోపణలు.. కుటుంబమంతా పురుగులమందు తాగారు..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top