‘డెల్టా’పై టీకాల ప్రభావం అంతంతే!

Covid vaccines 8 times less effective against Delta variant - Sakshi

న్యూఢిల్లీ: డెల్టా వేరియంట్‌ (బి.1.617.2).. ఇప్పుడు ప్రపంచాన్ని వేగంగా చుట్టేస్తున్న కరోనా మహమ్మారిలోని కొత్తరకం ఇది. మరోవైపు కరోనా నియంత్రణ కోసం టీకాలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే, ఈ టీకాలు చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఒరిజినల్‌ వేరియంట్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా 8 రెట్లు తక్కువ ప్రభావం చూపుతున్నట్లు ఢిల్లీలోని సర్‌ గంగారాం ఆసుపత్రి నిర్వహించిన అధ్యయనంలో తేలింది. కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయన్న సంగతి తెలిసిందే.

ఈ ప్రతిరక్షకాలు కరోనా దాడిని అడ్డుకుంటాయి. డెల్టా వేరియంట్‌పై టీకాల వల్ల ఉత్పత్తి అయిన యాంటీబాడీలు 8 రెట్లు తక్కువగా స్పందిస్తున్నట్లు గుర్తించారు. సర్‌ గంగారాం హాస్పిటల్‌ సహా దేశంలో మూడు కేంద్రాల్లో వంద మందికిపైగా హెల్త్‌కేర్‌ వర్కర్లపై ఈ అధ్యయనం నిర్వహించారు. కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న వారిలోనూ డెల్టా వేరియంట్‌ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు గమనించారు. అంటే కరోనా టీకాలు డెల్టాపై పెద్దగా ప్రభావం చూపడం లేదన్నమాట. డెల్టా రకం కరోనాను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళనకరమైన వేరియంట్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. నాన్‌–డెల్టా ఇన్ఫెక్షన్లతో పోలిస్తే డెల్టాలో వైరల్‌ లోడ్‌ అధికం. వేగంగా వ్యాప్తి చెందే లక్షణాన్ని కలిగి ఉంది. ఇది డామినెంట్‌ (ఆధిపత్య) వేరియంట్‌గా డబ్ల్యూహెచ్‌ఓ నిర్ధారించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top