ముప్పు వచ్చేస్తొంది.. కోవిడ్‌పై రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ | Sakshi
Sakshi News home page

Covid 19: ముప్పు వచ్చేస్తొంది.. కోవిడ్‌పై రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ

Published Thu, Jan 6 2022 7:17 PM

Covid 19: Central Govt Issues Guidelines To States On Precautions - Sakshi

ఢీల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కఠిన చర్యలు చేపట్టినా భారత్‌లో థర్డ్‌ వేవ్‌ ప్రారంభమైంది. ఓ పక్క వైరస్‌ అడ్డుకట్టకు టీకా కీలకమని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సంబంధిత అధికారులు అహర్నిశలు వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కష్టపడుతున్నారు. మరో వైపు కోవిడ్‌ చాప కింద నీరులా పాకుతూ దేశవ్యాప్తంగా తన ఉనికిని మళ్లీ చాటేందుకు చూస్తోంది.

దీంతో ఆప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు కోవిడ్‌పై పలు కీలక సూచనలు చేస్తూ లేఖ రాసింది. అందులో.. కోవిడ్‌ నివారణ చర్యలను ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది. జిల్లా, సబ్‌ స్థాయిలో కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలిని సూచించింది. ఆస్పత్రుల్లో సిబ్బంది, మౌలికవసతులు, పడకల లభ్యత చూసుకోవడంతో పాటు హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి తగిన వైద్య సూచనలు చేయాలిని ఆదేశించింది.

చదవండి: Passengers From Italy Tested Positive Amritsar: కలకలం: ఒకే విమానంలో ప్రయాణించిన 125 మందికి కరోనా..

Advertisement
Advertisement