Passengers From Italy Tested Positive Amritsar: కలకలం: ఒకే విమానంలో ప్రయాణించిన 125 మందికి కరోనా..

Passengers Flight From Italy Tested 125 Positive In Amritsar - Sakshi

అమృత్‌సర్‌: క‌రోనా మహమ్మారి మళ్లీ తన ప్రతాపాన్ని చూపేందుకు సిద్ధంగా ఉంది. దేశంలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందకు ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న కేసులు మాత్రం రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. దీంతో భారత్‌లో థ‌ర్డ్ వేవ్ ప్రారంభమైనట్లు అయిన‌ట్టు ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేస్తూ, రాబోయే నాలుగు వారాలు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు జారీ చేసింది. 

గతంలోనూ విదేశాల నుంచి వ‌చ్చిన ప్రయాణికుల ద్వారానే దేశంలో వైరస్‌ వ్యాప్తికి ప్రధాన కారణమన్న సంగతి తెలిసింది. అందుకే ఈ సారి బయట దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ క్రమంలో పంజాబ్‌లోని అమృత్‌స‌ర్‌ విమానాశ్రయంలోకి వ‌చ్చిన చార్టర్డ్‌ విమానంలో క‌రోనా క‌ల‌క‌లం రేగింది. గురువారం ఇట‌లీ నుంచి అమృత్స‌ర్‌కు చార్టర్డ్‌ ప్లైట్‌లో వ‌చ్చిన ప్రయాణికులను పరీక్షల జరుపగా అందులో 125 మందికి క‌రోనా నిర్థారణ అయినట్లు అధికారులు తెలిపారు. దీంతో వీరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్‌కు పంపారు. విమానంలో మొత్తం 179 మంది ప్రయాణికులు ఉన్నారు. పాజిటివ్‌గా తేలిన ప్రయాణికులను ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌కు పంపిస్తామని రాష్ట్ర ఆరోగ్య అధికారులు తెలిపారు.

చదవండి: ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం.. సుప్రీంకోర్టులో విచారణ!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top