India Records 1,20,529 New Positive Cases Last 24 Hours - Sakshi
Sakshi News home page

Corona downtrend: దేశంలో తగ్గుతున్న కొత్త కేసులు

Jun 5 2021 10:24 AM | Updated on Jun 5 2021 12:48 PM

Coronavirus: 120529 New Covid Positive Cases Registered In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యా​ప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,20,529 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్‌ కేసులు సంఖ్య 2,86,94,879కి చేరింది. గత 24 గంటల్లో 3,380 మంది కరోనాతో మృతి చెందారు.

దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,44,082కి పెరిగింది. గత 24 గంటల్లో 1,97,894 మంది కోవిడ్‌ పేషెంట్లు వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు దేశంలో 2,67,95,549 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక  దేశంలో ప్రస్తుతం 15,55,248 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 22,78,60,317 మందికి వ్యాక్సినేషన్‌ అందించారు. 
చదవండి: ఆ వేరియంట్‌ వల్లే భారీగా కేసులు

Advertisement
 
Advertisement
Advertisement