ఆ వేరియంట్‌ వల్లే భారీగా కేసులు

B.1.617 variant of SARS-CoV-2 drove surge in the COVID-19 cases in last 2 months - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో రెండు నెలలుగా భారీగా కోవిడ్‌ కేసులు పెరగడానికి బి.1.617 వేరియంటే ప్రధాన కారణమని ఇండియన్‌ సార్స్‌–కోవ్‌–2 కన్సార్టియం ఆన్‌ జెనోమిక్స్‌(ఇన్సాకాగ్‌) స్పష్టం చేసింది. ఏప్రిల్, మే నెలల్లో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా భారీగా కేసులు పెరిగిన విషయం తెలిసిందే. మొట్టమొదటిసారిగా యూకేలో బయటపడిన వైరస్‌ వేరియం ట్‌ బి.1.1.7 లేదా ఆల్ఫా కేసులు ఇప్పుడు దేశంలో ఒకటిన్నర నెలలుగా తగ్గుముఖం పట్టాయని దేశం లోని 10 జాతీయ స్థాయి ప్రయోగశాలల ఉమ్మడి వేదిక ఇన్సాకాగ్‌ తెలిపింది.

కోవిడ్‌ వేరియంట్‌ బి.1.617 కేసులు మొదటిసారిగా మహారాష్ట్రలో బయటపడగా ఇప్పుడు పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, తెలంగాణల్లోనూ పెరిగినట్లు తెలిపింది. గడిచిన 2 నెలలుగా కొన్ని రాష్ట్రా ల్లో భారీగా కేసులు పెరగటానికి బి.1.617 వేరియంట్‌కు సంబంధం ఉందని ఇన్సాకాగ్‌ పే ర్కొంది. ఈ వేరియంట్‌ ఇప్పుడు బి.1.617.1, బి.1.617.2, బి1.671.3 అనే వేరియంట్లుగా మారినట్లు తెలిపింది. ఇందులోని బి.1.617.2 వేరియంట్‌ వ్యాప్తి ఎక్కువగా ఉందని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల దీనికి డెల్టా వేరియంట్‌గా నామకరణం చేసినట్లు గుర్తు చేసింది.

వారణాసి ప్రాంతంలో 7 వేరియంట్లు
సాక్షి, హైదరాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి ప్రాంతంలో కనీసం 7 కరోనా వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నట్లు బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, (బీహెచ్‌యూ) సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) సంయుక్త అధ్యయనంలో తేలింది. వారణాసి పరిసర ప్రాంతాల్లోని పలు వేరియంట్ల జన్యుక్రమాలను విశ్లేషించి పరిశీలించినప్పుడు ఈ ఏడు రకాలు ఆ ప్రాంతంలో ఎక్కువ వ్యాప్తిలో ఉన్నట్లు తెలిసిందని సీసీఎంబీ తెలిపింది. దేశంలో రెండో దఫా కోవిడ్‌ కేసులు పెరిగేందుకు కూడా ఈ వేరియంటే కారణమని బీహెచ్‌యూ శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ సింగ్‌ తెలిపారు.

దేశంలోని ఇతర ప్రాంతాల్లో మాదిరిగానే బి.1.617.2 లేదా డెల్టా వేరియంట్‌ కూడా ఈ ప్రాంతంలో చాలా సాధారణంగా కనిపించిందని ఆయన వివరించారు. సేకరించిన నమూనాల్లో 36 శాతం ఈ వేరియంట్‌వేనని తెలిపారు. వీటితోపాటు దక్షిణాఫ్రికాలో గుర్తించిన బి.1.351 వేరియంట్‌ను తొలిసారి వారణాసి ప్రాంతంలో గుర్తించామని సీసీఎంబీ గౌరవ సలహాదారు డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు.
చదవండి: ఏడాదిలోపే కోవిడ్‌ ఆయుధాలు సిద్ధం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

05-06-2021
Jun 05, 2021, 08:11 IST
సాక్షి, చెన్నై: తెలుగు సినీ చలనచిత్ర పరిశ్రమలో సీనియర్‌ మేకప్‌ చీఫ్‌ సి.మాధవరావుకు సతీవియోగం కలిగింది. ఆయన భార్య సుబ్బలక్ష్మమ్మ (76) కరోనాతో చెన్నైలో...
05-06-2021
Jun 05, 2021, 06:21 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా కోర్టుల పనితీరును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ సమీక్షించారు. హైకోర్టుల్లో...
05-06-2021
Jun 05, 2021, 06:02 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రభావం నెమ్మదిగా తగ్గుతోంది. గత నెల 4.14 లక్షల వరకు చేరుకున్న పాజిటివ్‌ కేసులు...
05-06-2021
Jun 05, 2021, 05:01 IST
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దాడి ప్రారంభమై సంవత్సరం గడవకముందే దానిపై పోరాటానికి ఆయుధాలను సిద్ధం చేసిన భారతీయ శాస్త్రవేత్తలను ప్రధాన...
05-06-2021
Jun 05, 2021, 04:39 IST
సాక్షి, దామరగిద్ద: కరోనా మహమ్మారి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. గంటల వ్యవధిలోనే తల్లి, కుమారుడు, తండ్రిని బలి తీసుకుంది. నారాయణపేట...
04-06-2021
Jun 04, 2021, 21:20 IST
లండన్‌: భారత్‌లో అత్యంత వేగంగా వ్యాపించిన కొవిడ్ -19 డెల్టా వేరియంట్ (బీ1.617.2) ఇప్పుడు బ్రిట‌న్‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. ఆ దేశంలో...
04-06-2021
Jun 04, 2021, 20:56 IST
చెన్నై : కరోనా వైరస్‌ కారణంగా ఓ తొమ్మిదేళ్ల సివంగి మృత్యువాతపడింది. చెన్నైలోని అరిగ్నర్‌ అన్నా జూలాజికల్‌ పార్కులో గురువారం...
04-06-2021
Jun 04, 2021, 17:56 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతోందని  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్...
04-06-2021
Jun 04, 2021, 17:18 IST
బీజింగ్‌: కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత అమెరికాతో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు చైనా నుంచే ఈ వైరస్‌...
04-06-2021
Jun 04, 2021, 16:54 IST
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 85,311 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1‌‌0,413 కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది....
04-06-2021
Jun 04, 2021, 12:03 IST
వ్యాక్సిన్‌ వేయుంచుకున్న వారికి లక్కీ డ్రా రూపంలో విలువైన వస్తువులను అందిస్తోంది.
04-06-2021
Jun 04, 2021, 08:13 IST
సాక్షి, బెంగళూరు: కరోనా రక్కసి మారణహోమం కొనసాగిస్తోంది. కేసులు తగ్గినప్పటికీ మృత్యు బీభత్సం అదుపులోకి రావడం లేదు. గత 24...
04-06-2021
Jun 04, 2021, 05:41 IST
తంగళ్లపల్లి (సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌ గ్రామానికి చెందిన ముత్తంగి శ్రీనివాస్‌రెడ్డి (45)ది వ్యవసాయ కుటుంబం....
04-06-2021
Jun 04, 2021, 04:55 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌ మహమ్మారి వల్ల ప్రభావితులైన చిన్నారుల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర...
04-06-2021
Jun 04, 2021, 02:27 IST
సాక్షి, హైదరాబాద్‌: అధిక ఫీజుల వసూలు ఆరోపణలకు సంబంధించి ఆస్పత్రులు, రోగులతో చర్చించి బాధితులకు రిఫండ్‌ చేసే విషయంలో చర్యలు...
04-06-2021
Jun 04, 2021, 01:38 IST
న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన దేశీ దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ గతేడాది(2020–21)లో వేతనాన్ని వొదులుకున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) పేర్కొంది....
03-06-2021
Jun 03, 2021, 19:52 IST
సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం క్యాంప్‌ కార్యాలయంలో సమీక్షా సమావేశం చేపట్టారు....
03-06-2021
Jun 03, 2021, 19:33 IST
సాక్షి, న్యూఢిల్లీ:  కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ ప్రకంపనలు ఇంకా చల్లారకముందే థర్డ్‌ వేవ్‌ ఆందోళన దేశ ప్రజలను వణికిస్తోంది. ముఖ్యంగా  థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై...
03-06-2021
Jun 03, 2021, 19:23 IST
బెంగళూరు: దేశంలో కరోనా ​ఉధృతి కొనసాగుతూనే ఉంది. మొదటి దశలో కంటె సెకండ్​వేవ్​లో వైరస్​ వేగంగా వ్యాపిస్తోంది. అనేక రాష్ట్రాలు...
03-06-2021
Jun 03, 2021, 19:03 IST
సాక్షి, హైదరాబాద్ ‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,261 కరోనా కేసులు నమోదు కాగా.. 18 మరణాలు చోటుచేసుకున్నాయి. తాజా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top