16న జెండాలతో తరలిరండి: దీప్కే | Abhijeet Dipke calls for Tiranga march at Connaught Place on 16 October 2026 | Sakshi
Sakshi News home page

16న జెండాలతో తరలిరండి: దీప్కే

Oct 15 2026 5:49 AM | Updated on Oct 15 2026 5:49 AM

Abhijeet Dipke calls for Tiranga march at Connaught Place on 16 October 2026

త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం నేరం కాదని నిరూపిద్దామని పిలుపు 

న్యూఢిల్లీ: త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన సౌరవ్‌ దాస్, అశుతోష్‌ రాంకాలకు జైలు శిక్ష విధించడాన్ని నిరసిస్తూ 16వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ కన్నాట్‌ ప్లేస్‌లోని సెంట్రల్‌ పార్క్‌ వద్ద జాతీయ జెండాలతో సమావేశం కావాలని దేశభక్తులకు సీజేపీ వ్యవస్థాపకుడు పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకాన్ని ప్రేమించే దేశభక్తులందరూ తరలి రావాలని కోరారు.

 జాతీయ జెండాను ఎగురవేయడం నేరం కాదని మనం నిరూపించి చూపిద్దామని బుధవారం దీప్కే ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. ఢిల్లీకి రాలేనివారు తమ ప్రాంతాల్లోనే ‘త్రివర్ణ పతాక యాత్రలు’నిర్వహించాలని కోరారు. త్రివర్ణ పతాకమే మన గర్వకారణమని చాటి చెప్పాలని సూచించారు. తాను జెండా ఎగురవేస్తానని చెప్పారు. ప్రభుత్వం తనను కూడా జైలుకు పంపవచ్చని  దీప్కే అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement