
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న కార్యక్రమాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పొగడ్తల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ దేశాన్ని నడిపిస్తున్న తీరు అఘోఘమని శశిథరూర్ కొనియాడారు. ఆపరేషన్ సిందూర్ తో దాయాది పాకిస్తాన్ కు ఒక క్లియర్ మెస్సేజ్ పంపించారని అన్నారు. ఇక్కడ పాకిస్తాన్ ఏదో సాధించినట్లు చెప్పుకుంటున్న దానిని అస్సలు పట్టించుకోవాల్సి అవసరం లేదన్నారు.
ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ ఏం జరిగిందో అంతా చూశారన్నారు శశిథరూర్. భారత్, పాకిస్తాన్ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతను సమర్థవంతంగా తిప్పికొట్టారని, ఇందులో తమకు ఎటువంటి సందేహం లేదన్నారు శశిథరూర్.
ప్రధానిగా మోదీ దేశానికి ఏం చేయాలో అది చేస్తున్నారు. ప్రత్యేకంగా సంక్షోభ సమయంలో మోదీ వ్యవహరిస్తున్నరు నిజంగా అద్భుతమన్నారు. అది కోవిడ్ లాంటి మహమ్మారి అయినా దేశ ద్రోహులపై చేసే యుద్ధమైనా మోదీ స్పందిస్తున్న తీరు వెలకట్టలేనిది. ఏది దేశానికి ముఖ్యమో అది మోదీ ఒక ప్రధానిగా చేసి చూపిస్తున్నారని శశిథరూర్ ప్రశంసించారు.
ఈ మేరకు జాతీయ మీడియా ఎన్డీటీవో మాట్లాడిన శశిథరూర్.. దేశాన్ని నాలుగు కోణాల్లో చూస్తూ ముందుండి నడిపిస్తున్న నేత మోదీ అని కొనియాడారు. భారత్ సంక్షోభంలో ఉన్న ప్రతీసారి మోదీ ఇకపై కూడా ఇలానే వ్యవహరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు లోక్ సభ ఎంపీ శశథరూర్.
ఇక్కడ చదవండి: