పెళ్లిలో స్నేహితులు ఇచ్చిన విచిత్ర బహుమతి..! వధువు షాక్‌

Brides Reaction On Receiving A Baby Bottle From Friends - Sakshi

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. ప్రతి వధూవరులకు పెళ్లి రోజు చాలా ప్రత్యేకమైంది. తమ వివాహ వేడుకను చిరస్మరణీయంగా మార్చుకోవడానికి ఉన్నంతలో ఎంతో ఘనంగా పెళ్లి వేడుకను చేసుకుంటున్నారు. అయితే, పెళ్లికి వచ్చే స్నేహితులు, బంధువు మిత్రులు సైతం ఆ వివాహ వేడుక మరింత గుర్తుండిపోయేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటీవల కాలంలో పెళ్లిళ్లకు సంభందించిన వీడియోలు సోషల్‌ మీడియోలో  వైరల్‌ అవుతున్నాయి. ఈ క్రమంలో వివాహానికి సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందటే.. వధూవరులిద్దరూ వేదికపై నిల్చోని ఉన్నారు.

ఇంతలో వరుడు స్నేహితులు స్టేజీపైకి వచ్చారు. ఇంతలో మరో స్నేహితుడు  వధువుకు ఒక విచిత్ర బహుమతిని అందజేశాడు. అది ఓపెన్ చేసిన చూసిన వధువు షాక్ అవడంతో పాటు.. కోపంతో, ఆమె ముఖం తిప్పింది. ఎందుకంటే.. ఆ గిఫ్ట్ బాక్స్‌లో పాలసీసా ఉంది. అయితే స్నేహితులు చేసిన చిలిపి పనికి అక్కడ ఉన్నవారంతా నవ్వారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయగా.. అది ఇప్పుడు అన్ని సోషల్ మీడియా లో తెగ వైరల్‌ అవుతుంది. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. వీడియోను చూసి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఈ వీడియోపై ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top