ప్రముఖ గాయకుడు కన్నుమూత.. ప్రధాని సంతాపం

Bhajan Singer Narendra Chanchal Passed Away PM Tweets Condolences - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ గాయకుడు నరేంద్ర చంచల్‌(80) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. కాగా పంజాబ్‌లో జన్మించిన నరేంద్ర చంచల్‌..  ‘భజన్‌ కింగ్‌’గా గుర్తింపు పొందారు. ఆధ్యాత్మిక భజనలతో పాటు పలు హిందీ పాటలు ఆలపించిన ఆయన, బాబి సినిమాలోని ‘బేషక్‌ మందిర్‌ మసీద్‌’ పాటకు గానూ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నారు. (చదవండి‘ది కశ్మీరీ ఫైల్స్‌’.. బెదిరింపులకు భయపడను )

ప్రధాని సంతాపం
నరేంద్ర చంచల్‌ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. తన మధురమైన గానంతో ఆధ్యాత్మిక ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఇక దిగ్గజ గాయకురాలు లతా మంగేష్కర్‌ సైతం సోషల్‌ మీడియా వేదికగా నరేంద్ర చంచల్‌కు నివాళులు అర్పించారు. అదే విధంగా టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ నరేంద్ర చంచల్‌ మృతి పట్ల విచారం వ్యక్తం చేశాడు. ఆయన కుటుంబానికి ప్రగాభ సానుభూతి ప్రకటించాడు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు, కేంద్ర సాంస్కృతిక శాఖ ఆయనను స్మరించుకుంటూ ట్విటర్‌ వేదికగా సంతాపం ప్రకటించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top