15 కి.మీ.లకు రూ.1200 | Bengaluru Woman Pays ‘Rs 1200’ For ‘15 Km’ Auto Ride During Rain! | Sakshi
Sakshi News home page

15 కి.మీ.లకు రూ.1200

May 7 2026 8:35 AM | Updated on May 7 2026 8:35 AM

Bengaluru Woman Pays ‘Rs 1200’ For ‘15 Km’ Auto Ride During Rain!

యశవంతపుర: బెంగళూరులో 15 కిలోమీటర్ల దూరం ఆటోరిక్షాలో వెళ్లినందుకు రూ.1200 చార్జీ వసూలు చేసినట్లు ఓ మహిళ సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వర్షం వస్తున్న సమయంలో ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉంది, అందువల్ల స్నేహితులతో కలిసి ఆటోలో వెళ్లాను, ఇందుకు రూ.1200 వసూలు చేశారు, ఇది చాలా ఎక్కువ అని వివరించారు. ఈ పోస్టుపై సాన్యా సింగ్‌  అనే నెటిజన్‌ స్పందిస్తూ, బెంగళూరులో ఇలా ఉంటుందని ఊహించలేదు. 

మంగళవారం తన స్నేహితులతో కలిసి 15 కిలోమీటర్ల దూరం ఆటోలో ప్రయాణించినందుకు 12 వందలు చార్జీ చేశారు. ఈ డబ్బుతో రెండుసార్లు ఇంటి సరుకులను కొనవచ్చు. బెంగళూరులో వయొలిన్‌ కంటే హార్న్‌ శబ్దమే జోరుగా వినపడుతుంది. కాలేజీలో ప్రవేశం కంటే ఇక్కడ రైడ్‌ను బుక్‌ చేయడం కష్టంగా ఉంటుంది అని విమర్శించారు. మన కెరియర్‌ పెరుగుతుందో, లేదో తెలియదు. ఆటో డ్రైవర్లు మాత్రం శ్రీమంతులు అవుతారని దుయ్యబట్టారు. పెద్ద మొత్తంలో చార్జీ చేయటం అన్యాయమంటూ కొందరు పేర్కొన్నారు. ఈ పోస్టుతో బెంగళూరులో ఆటో, క్యాబ్‌ చార్జీలు చర్చనీయాంశమయ్యాయి. 

Advertisement
 
Advertisement
Advertisement