కర్ణాటక ఎన్నికల ప్రచార కమిటీ సారథిగా సీఎం బొమ్మై | Sakshi
Sakshi News home page

కర్ణాటక ఎన్నికల ప్రచార కమిటీ సారథిగా సీఎం బొమ్మై

Published Sat, Mar 11 2023 5:57 AM

Basavaraj Bommai Appointed Chairman Of BJP Campaign Committee For Karnataka Polls - Sakshi

న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీకి మరికొద్ది నెలల్లో జరగనున్న ఎన్నికలకు బీజేపీ సమాయత్తమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైను నియమించింది. అదేవిధంగా ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా కేంద్ర మంత్రి శోభా కరంద్లాజెను ప్రకటించింది. ఎన్నికల ప్రచార కమిటీ సభ్యుడిగా మాజీ సీఎం యెడియూరప్పను నియమించింది.

ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు కమిటీలకు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన లింగాయత్, వొక్కలిగ కులాలకు చెందిన బొమ్మై, కరంద్లాజెలకు సారథ్య బాధ్యతలు అప్పగించడం ద్వారా బీజేపీ జాతీయ నాయకత్వం సమతూకం సాధించేందుకు ప్రయత్నించింది. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement