లైవ్‌ అప్‌డేట్స్‌: కొనసాగుతున్న 5 రాష్ట్రాల పోలింగ్‌

Assembly Election 2021 Polling Live Updates: Voting Begins In Tamil Nadu, Kerala, Bengal, Assam, Puducherry - Sakshi

లైవ్‌ అప్‌డేట్స్‌:
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. పశ్చిమబెంగాల్‌, అసోం, పుదుచ్చేరిలో భారీగా పోలింగ్‌ నమోదైంది. పలు కేంద్రాల్లో వరుసలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం అధికారులు కల్పించారు. ఓటుహక్కు వినియోగించుకునేందుకు భారీగా ఓటర్లు తరలివచ్చారు.

ప‌శ్చిమ బెంగాల్: 76.84
త‌మిళ‌నాడు : 65.11
కేర‌ళ : 67.96
అసోం : 81.85
పుదుచ్చేరి : 78.03

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. పశ్చిమబెంగాల్‌, అసోం, పుదుచ్చేరిలో భారీగా పోలింగ్‌ నమోదైంది. ఓటుహక్కు వినియోగించుకునేందుకు భారీగా ఓటర్లు తరలివస్తున్నారు.

5 గంటల వరకు నమోదైన పోలింగ్‌
ప‌శ్చిమ బెంగాల్: 76.84
త‌మిళ‌నాడు : 61.34
కేర‌ళ : 69.24
అసోం : 78.32
పుదుచ్చేరి : 76.46

4 గంటల వరకు పోలింగ్‌ శాతం
ప‌శ్చిమ బెంగాల్: 67.27
త‌మిళ‌నాడు : 53.35
కేర‌ళ : 59.91
అసోం : 68.31
పుదుచ్చేరి : 66.36

3 గంటల వరకు
ప‌శ్చిమ బెంగాల్: 54.43
త‌మిళ‌నాడు : 43.40
కేర‌ళ : 51.4
అసోం : 54.73
పుదుచ్చేరి : 54.27

రెండు గంటల వ‌ర‌కు న‌మోదైన పోలింగ్ శాతం
ప‌శ్చిమ బెంగాల్: 54.43
త‌మిళ‌నాడు : 40.94
కేర‌ళ : 51.4
అసోం : 53.23
పుదుచ్చేరి : 54.21

► ఒంటి గంట వ‌ర‌కు న‌మోదైన పోలింగ్ శాతం
ప‌శ్చిమ బెంగాల్: 53.89
త‌మిళ‌నాడు : 39.61
కేర‌ళ : 43.3
అసోం : 53.23
పుదుచ్చేరి : 53.35

► త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓటు హ‌క్కు వినియోగించుకున్న ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్‌.

డీఎంకే యువ నేత ఉదయనిధి స్టాలిన్‌ భార్య కిరుతిగ ఉదయనిధి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే విధంగా హీరో సిద్ధార్థ్ ఓటు వేశారు.
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు తమిళనాడులో 22.92 శాతం, అసోంలో 33.18 శాతం, కేరళలో 31. 62 శాతం, పుదుచ్చేరి 35. 71 శాతం, పశ్చిమ బెంగాల్‌ 34.71 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులుపేర్కొన్నారు. 

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు  26.29 పోలింగ్ శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.

► కేరళలో అసెంబ్లీ ఎ‍న్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఇప్పటివరకు కేరళలో 23.33 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.‌


► తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పళనిస్వామి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే విధంగా సినీ నటి కుష్బూ, నటుడు విక్రమ్‌ ఓటు వేశారు. కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

► తమిళనాడులోని విరుగంబక్కంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళనాడులో పోలింగ్‌ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు.

► నటుడు విజయ్‌ చెన్నై నీలంకరైలోని వెల్స్‌ ఇంటర్నేషనల్ ప్రీస్కూల్‌కి సైకిల్‌ మీద వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

► పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 9 గంటల వరకూ 16.06 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారలు పేర్కొన్నారు.

► చెన్నైలోని తేనాంపేట్‌లో డీఎంకే అధినేత స్టాలిన్‌, ఆయన తనయుడు ఉదయనిధి ఓటు హక్కు వినయోగించుకున్నారు. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూలైన్లలో బారులు తీరారు.

► కేరళలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి తరలివస్తున్నారు. 

► పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓట్లర్లు పెద్ద సంఖ్యలో పోలిం‍గ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. యానాం అసెంబ్లీ స్థానంలో పోలింగ్‌ కొనసాగుతోంది.‌ మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు యానాంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

► తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం తరలివస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్‌ నేత చిదంబం ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా సినీ నటుడు సూర్య, ఆయన తమ్ముడు నటుడు కార్తీ ఓటు వేశారు.


► తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు కమల్‌హాసన్‌, ఆయన కుమార్తెలు శృతిహాసన్‌, అక్షర హాసన్‌ చెన్నైలో తమ ‌ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే విధంగా తిరువాన్మయూర్‌లో నటుడు అజిత్ ఓటు వేశారు.

 పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. కేరళలోని పాలక్కాడ్‌లో బీజేపీ అభ్యర్ధి శ్రీధరన్ఓటు వేశారు.‌ అదేవిధంగా చెన్నైలో సినీ నటుడు రజనీకాంత్ ఓటు వేశారు.‌ ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు.

సాక్షి, చెన్నై/కోల్‌కతా/తిరువనంతపురం: పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో మంగళవారం ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సాంలో మూడో విడత ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. చివరి గంటలో ఓటు వేసేందుకు కరోనా బాధితులను అనుమతిస్తారు. వీరి కోసం ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో మూడో దశలో 31 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

78.5 లక్షల మంది ఓటు వేయనున్నారు. 31 స్థానాల్లో 205 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్‌ జరుగనుండడంతో అధికారులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తమిళనాడు 234, కేరళ 140, పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అసోంలో తుది విడత పోలింగ్‌లో భాగంగా 12 జిల్లాల్లోని 40 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.‌ మే 2న బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడించన్నారు.

కేరళలో 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2.74 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. 957 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.అస్సాంలో మూడో దశలో(చివరి దశ) 40 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 337 మంది అభ్యర్థుల జాతకాన్ని ఓటర్లు నిర్దేశించబోతున్నారు. చివరి దశ ఎన్నికల్లో 25 మంది మహిళా అభ్యర్థులు సైతం పోటీ పడుతున్నారు. 11,401 పోలింగ్‌ కేంద్రాల్లో 79.19 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top