టూరిస్టులకు చుక్కలు చూపించిన ఏనుగు.. కోపం వస్తే ఇంతే మరీ!

Angry Elephant Charges Safari Car And Video Goes Viral - Sakshi

ఏనుగులు సాధారణంగా ఎంతో ప్రశాంతమైన జీవులు. అవి ఎంత ప్రశాంతంగా ఉంటాయో.. వాటికి కోపం తెప్పిస్తే మాత్రం మామూలుగా ఉండదు. వెంటపడి మరీ దాడి చేస్తాయి. తాజాగా ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో కొందరు టూరిస్టులో కొద్దిలో ఏనుగు దాడి నుంచి తప్పించుకున్నారు. 

ఐఎఫ్ఎస్ అధికారి సాకేత్ బ‌దోలా ట్విట్ట‌ర్‌లో ఓ వీడియోను షేర్‌ చేశారు. కాగా, వీడియోలో అడవిలో సందర్శనకు వచ్చిన టూరిస్టులను ఏనుగు త‌రుముతుండ‌టంతో స‌ఫారీ డ్రైవ‌ర్ వాహ‌నాన్ని వేగంగా రివ‌ర్స్ చేస్తుండ‌టం ఈ వైర‌ల్ వీడియోలో ప్ర‌తి ఒక్క‌రినీ ఉత్కంఠ‌కు లోనుచేస్తుంది. సఫారీ డ్రైవర్‌ ఏమాత్రం త‌డ‌బాటు లేకుండా జీపును వెనక్కి డ్రైవ్‌ చేస్తాడు. ఆ సమయంలో ఏనుగు ఆగ్రహంతో సఫారీ మీదకు దూసుకు వస్తుంది. 

ఇక, ఇలా కొంత దూరం వెనక్కి వెళ్లిన తర్వాత ఏనుగు తనంతట తానే రూట్‌ మార్చి అడవిలోకి వెళ్లిపోతుంది. దీంతో, సఫారీలో ఉన్న టూరిస్టులు సేదా తీసుకుంటారు. కాగా, వీడియో షేర్‌ చేసిన సాకేత్‌ బదోలా.. డ్రైవ‌ర్‌ను ప్రశంసిస్తూ ఏనుగు ఎందుకు ఆగ్ర‌హంగా దూసుకెళ్లిందో విచారించాల‌ని అధికారులను కోరుతూ ఈ వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చారు. ఇక, ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ఏనుగు ఇంత వయలెంట్‌గా ఉందేంటి కామెంట్స్‌ చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top