కరోనా నుంచి కోలుకున్న అమితాబ్‌ | Amitabh Bachchan Discharged From Hospital | Sakshi
Sakshi News home page

కరోనా నుంచి కోలుకున్న అమితాబ్‌

Aug 2 2020 5:09 PM | Updated on Aug 2 2020 9:28 PM

Amitabh Bachchan Discharged From Hospital - Sakshi

ముంబై: కొన్ని రోజుల క్రితం కరోనా వైరస్‌ బారిన పడి చికిత్స తీసుకుంటున్న బాలీవుడ్‌ మెగాస్టార్‌, బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ కోలుకున్నారు. కరోనా నుంచి  అమితాబ్‌ బచ్చన్‌ కోలుకొని ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు.  గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్‌తో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న అమితాబ్‌.. నేడు పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల కరోనా పరీక్షల్లో అమితాబ్‌కు నెగటివ్‌ వచ్చిందనే నకలీ వార్త సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. దీని పై అమితాబ్‌ ఘాటుగానే స్పందించారు. బాధ్యతారాహిత్యంతో కూడిన వార్తలను ప్రచారం చేయవద్దని అమితాబ్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అమితాబ్‌ కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్, మనవరాలు ఆరాధ్యకు కూడా కరోనా సోకగా, ఇటీవలే ఐశ్వర్యరాయ్‌, ఆరాధ్య, ఇద్దరు కోలుకున్నారు. (వాళ్ల‌కు భూమ్మీద బ‌తికే అర్హ‌త లేదు)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement