హిమాలయాల్లో విష వాయువులు | air pollution in Himalayas | Sakshi
Sakshi News home page

హిమాలయాల్లో విష వాయువులు

Jun 18 2026 5:52 AM | Updated on Jun 18 2026 5:52 AM

air pollution in Himalayas

గాలిలో ప్రమాదకర స్థాయికి చేరిన క్యాన్సర్‌ కారక ‘బెంజీన్‌’

విపరీతమైన పర్యాటకం, నిర్మాణాల వంటి మానవ కార్యకలాపాలతో పెను ముప్పు 

శాస్త్రవేత్తల అధ్యయయంలో విస్తుపోయే విషయాలు

సాక్షి, న్యూఢిల్లీ: మంచుమయ హిమాలయాల ను కొత్త సమస్య ముంచెత్తుతోంది. వాతావరణ మార్పుల కారణంగా ఉష్నోగ్రతలు వేడెక్కి ఓవై పు మంచు పర్వతాలు కరిగిపోతుంటే ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిన మానవ సంచా రం, పర్యాటకం, నిర్మాణాలతో హానికారక విష వాయులూ ఇప్పుడు హిమాలయాలను కమ్మేస్తు న్నాయి. స్వచ్ఛమైన గాలి, మంచు కొండలమ యమైన హిమాలయ ప్రాంతాలు ఇప్పుడు వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్నాయి. హిమాలయాల్లోని అత్యంత మారుమూల ప్రాంతాలు సైతం విషవాయువుల ప్రభావానికి గురవుతున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడించాయి.

విషవాయువులతో హిమాలయాల్లో ప్రకృతి సమతుల్యత దారుణంగా దెబ్బతింటోందని పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. హిమాలయా ల్లో గాలి నాణ్యత వేగంగా క్షీణిస్తోందని, దీంతో భవిష్యత్తులో ప్రజల ఆరోగ్యంపైనా ఇది దుష్ప్ర భావం చూపనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తు న్నారు. మానవ తప్పిదాల వల్లే ఈ దుస్థితి దాపు రించిందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ సైతం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

వెలుగులోకి విస్మయ అంశాలు
కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయంప్రతిపత్తితో పనిచేసే ఆర్యభట్ట రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అబ్జర్వేషనల్‌ సైన్సెస్‌ (ఏఆర్‌ఐ ఈఎస్‌) శాస్త్రవేత్తలు ఉత్తరాఖండ్‌లో ఎత్తయిన ప్రముఖ పర్యాటక కొండ ప్రాంతమైన మున్‌స్యా రీలో విస్తృత పరిశోధనలు చేశారు. అక్కడ గాలిలో నాన్‌–మిథేన్‌ హైడ్రోకార్బన్స్‌(ఎన్‌ఎంహెచ్‌సీ) స్థాయిలను గణించారు. శీతాకాలం, వర్షాకాలంలో ఎన్‌ఎంహెచ్‌సీ స్థాయిలో తక్కువ గా నమోదయ్యాయి.

కానీ వసంతకాలం, ఎండాకాలంలో వీటి స్థాయిలో అత్యధికంగా పెరిగి నట్లు తేలింది. గత కొన్నేళ్లలో ఈ ప్రాంతంలో పర్యాటకం పెరిగిపోయింది. ద్రవ పెట్రోలియం గ్యాస్‌(ఎల్పీజీ), డీజిల్‌ వాడకం ఎక్కువైంది. వాహనాల రాకపోకలతో గాల్లోకి కాలుష్యకారకా లు విచ్చలవిడిగా వెలువడుతున్నాయి. వీటికి తోడు స్థానికంగా నిర్మాణ రంగ కార్యకలాపాలు బాగా ఊపందుకున్నాయి. వీటితోనూ కాలుష్యం పెరుగుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు.

బెంజీన్, గ్జైలీన్‌..
హిమాలయ పర్వత ప్రాంతాల్లో అతి మానవ కార్యకలాపాలతో గాల్లోకి కాలుష్య కారక బెంజీన్, గ్జైలీన్‌ వంటి ఆరోమాటిక్‌ హైడ్రోకార్బన్లు విడుదలవుతున్నాయి. ఇవి ట్రోపోస్ఫియర్‌ ఆవరణంలోకి చేరినప్పుడు రసాయన చర్యలు జరిపి ఓజోన్‌ వంటి ప్రమాదకర వాయువుల సృష్టికి కారణమవుతున్నాయి. ఓజోన్‌ అనేది భూమి నుంచి అత్యంత ఎత్తుల్లో ఉన్నప్పుడు ఓజోన్‌పొరగా ఏర్పడి సూర్యుని నుంచి అతినీలలోహిత కిరణాల నుంచి పుడమికి రక్షణకవచంగా సాయపడుతుంది. కానీ అత్యంత తక్కువ ఎత్తులో, ముఖ్యంగా హిమాలయాల వంటి చోట్ల ఓజోన్‌ వాయువు జాడ పెరిగితే ఎంతో ప్రమాదకరం. ఓజోన్‌ అనేది గ్రీన్‌హౌస్‌ వాయువుగా మారి వాతారణ మార్పులకు కారణమవుతుంది. భూమిపై పచ్చదనం తగ్గడానికి కారణమవుతుంది.

చెట్లు కిరణజన్య సంయోగ క్రియను సమర్థవంతంగా జరపకుండా ఓజోన్‌ అడ్డుకుని పరోక్షంగా అడవుల విస్తీర్ణం తగ్గపోవడానికి కారణమవుతుంది. బెంజిన్,  గ్జైలీన్‌ వంటి ఆరోమాటిక్‌ హైడ్రోకార్బన్లు ప్రస్తుతం తక్షణ ఆరోగ్య ముప్పు తక్కువగా ఉన్నప్పటికీ వీటి మోతాదు గాల్లో ఎక్కువయ్యే కొద్దీ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. నైనిటాల్‌ వంటి హిల్‌స్టేషన్లలో కంటే మున్‌స్యారీలోనే కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇలాంటి సున్నిత పర్యావరణ ప్రాంతాలను రక్షించుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పౌరసమాజం నిరంతర నిఘా, ప్రత్యేక శుద్ధి ప్రణాళికలతో ముందుకు సాగాలని పరిశోధకులు సూచించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement