భారత్‌లో ఒక్కరోజే 83వేల కేసులు | 83883 New Corona Virus Positive Cases Recorded In India | Sakshi
Sakshi News home page

భారత్‌లో ఒక్కరోజే 83వేల కేసులు 

Sep 3 2020 11:13 AM | Updated on Sep 3 2020 11:57 AM

83883 New Corona Virus Positive Cases Recorded In India - Sakshi

భారత్‌లో గడిచిన 24 గంటల్లో 83,883 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

న్యూఢిల్లీ : భారత్‌లో గడిచిన 24 గంటల్లో 83,883 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 38,53,407వేలకు చేరింది. ఈ మేరకు గురువారం కేంద్ర వైద్యారోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులిన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే 1043మంది మృత్యువాతపడగా, మొత్తం 67,376మంది మరణించారు.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 29,70,493 మంది కరోనానుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 8 లక్షల 15 వేల 538 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 77.09 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదైన కేసుల్లో 1.75 శాతానికి మరణాల రేటు తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా  11,72,179 కరోనా పరీక్షలు నిర్వహించారు.

చదవండి : చనిపోతున్న వారిలో వృద్ధులే అధికం

Advertisement
 
Advertisement
Advertisement