ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సల్స్‌ మృతి | 2 Maoists Killed In Encounter With Security Forces | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సల్స్‌ మృతి

Feb 4 2024 6:14 AM | Updated on Feb 4 2024 6:14 AM

2 Maoists Killed In Encounter With Security Forces - Sakshi

నారాయణ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నారాయణ్‌పూర్‌ జిల్లా భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. నెల్నార్‌ ఏరియా కమిటీ కార్యదర్శి అరబ్‌ అలియాస్‌ కమ్లేశ్, లోకల్‌ ఆర్గనైజేషన్‌ స్క్వాడ్‌(ఎల్‌వోఎస్‌)కమాండర్‌ సోందు సారథ్యంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు ఓర్ఛా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గోమగల్‌ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం గాలింపు చేపట్టారు.

సాయంత్రం రెండు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో పరిశీలించగా ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు, రెండు తుపాకులు లభ్యమైనట్లు ఒక అధికారి తెలిపారు. మృతులను గుర్తించాల్సి ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement