ఉత్తరాఖండ్‌లో, జోషిమఠంలోని జ్యోతిష్ పీఠాధిపతి, శంకరాచార్యులు అవిముక్తేశ్వరానంద (Avimukteshwaranand) సంచలన ప్రకటన చేశారు. రెండు లక్షల మందితో కూడిన ఒక 'సైన్యాన్ని' ప్రారంభించే ప్రణాళికలను ప్రకటించారు. వీరిలో పురుషులు, స్త్రీలు,తృతీయ లింగ (Third gender) తో అన్ని కులాల వారు ఉంటారని ప్రకటించారు.
సంప్రదాయ , ఆధునిక ఆయుధాలతో సన్నద్ధమయ్యే ఈ 'సైన్యం', గో సంతతిని, హిందూ ధర్మాన్ని రక్షిస్తుందని ప్రస్తుతం యూపీలోని వారణాసిలో ఉంటున్న ఈ మత గురువు, తెలిపారు. ' ధర్మాన్ని, సంస్కృతిని , సమాజాన్ని రక్షించే ఈ 'సైన్యంలో' అన్ని హిందూ కులాలకు చెందిన 2,18,000 మంది సైనికులుగా చేర్చుకుంటామన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వచ్చే మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో ఈ 'సైన్యం' ప్రారంభిస్తామని అవిముక్తేశ్వరానంద తెలిపారు. దీనికి 'చతురంగిణి సేన' అని పేరుకూడా పెట్టారు.
'చతురంగిణి సేన'
2.8 లక్షల మందితో కూడిన ఈ సైన్యం హిందూ ధర్మాన్ని, సంస్కృతిని, గోవంశాన్ని రక్షిస్తుంది.
మహాభారత కాలంలోలాగా కాలబలం, అశ్వబలం, గజబలం, రథబలం అనే నాలుగు విభాగాలతో ఇది ఉంటుంది.
అన్ని హిందూ కులాల నుండి పురుషులు, మహిళలు , థర్డ్ జెండర్‌కి చెందిన వారు ఈ సైన్యంలో ఉంటారు.
వివాదాలు, చట్టపరమైన చిక్కులు
'సైన్యం’ ఏర్పాటు ప్రకటన వివాదాన్ని రేపింది. ముఖ్యంగా అవిముక్తేశ్వరానంద, ఆయన మద్దతు దారులు గొడ్డలి నమూనాలను ప్రదర్శించడంపై అధికార యంత్రాంగం నిశితంగా గమనిస్తున్నట్టు సమాచారం. లైసెన్సు లేని ఆయుధాలను కలిగి ఉండటం చవాటిని బహిరంగంగా ప్రదర్శించడం చట్టపరమైన చర్యలకు దారితీయవచ్చని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
యోగితో వైరం: మరోవైపు గత నెలలో, ప్రయాగ్‌రాజ్‌లో మాఘ మేళా సందర్భంగా, పల్లకీలో 'సంగమం' వైపు వెళ్లడానికి అనుమతి లభించకపోవడంతో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను విమర్శించి అవిముక్తేశ్వరానంద వార్తల్లో నిలిచారు.
ఇదీ చదవండి: జస్ట్ నిమిషాల్లో, దోసకాయ పచ్చడి : నటి వీడియో వైరల్
'పోక్సో'కేసు: ఆశుతోష్ బ్రహ్మచారి అనే మరో మత పెద్ద ఫిర్యాదు మేరకు గతంలో అవిముక్తే శ్వరానంద్‌పై ఉత్తరప్రదేశ్ పోలీసులు పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల నుండి 'బటుక్‌లు' అని పిలిచే యువ శిష్యులను ప్రయాగ్‌రాజ్‌లోని శంకరాచార్యుల ఆశ్రమానికి తీసుకువచ్చి,వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బ్రహ్మచారి ఆరోపించారు. అయితే, సనాతన ధర్మాన్ని దెబ్బతీయడానికే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని శంకరాచార్య కొట్టిపారేసిన సంగతి తెలిసిందే. (45 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి : గేమ్ ఛేంజర్)


